శ్రీ ఉమామహేశ్వరం హుండీ ఆదాయం రూ. 24.62 లక్షలు
17-03-2026 07:46 PM
అచ్చంపేట: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. శ్రీశైల ఉత్తర ముఖ ద్వారంగా భాసిల్లుతోన్న శ్రీ ఉమామహేశ్వర ఆలయ ఉండి ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. దేవాదాయ శాఖ నాగర్ కర్నూల్ డివిజన్ అధికారి మదన్ కుమార్, ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హుండీలను తెరిచారు. ఏడాది కాలంలో భక్తులు వివిద రూపాలలో వేసిన కానుకలు.. నగదు ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం ఆదాయం రూ. 24,62,407 వచ్చినట్లు ఈవో వెల్లడించారు. వాటిని ఆలయానికి సంబంధించిన వివిధ బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు.




