రైతులకు ప్రయోజనం
17-03-2026 07:37 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో వ్యవసాయం కాని అనుబంధ రంగాల అభివృద్ధిపై రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఆత్మ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. వ్యవసాయంలో సాంకేతిక విజ్ఞానం ఆధునిక పంటల సాగు వ్యవసాయ పరిశ్రమల ప్రోత్సహం చర్చించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్ లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్ అధికారులు పాల్గొన్నారు.




