ఏసీబీకి చిక్కిన ఇద్దరు టీచర్లు
- సహచర ఉపాధ్యాయుడి ఫైల్ ఫుట్ అప్‌నకు రూ.45 వేలు డిమాండ్
- చివరికి రూ.15వేలకు ఒప్పందం
- రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన క్లస్టర్ హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్
- ఈ క్లస్టర్ హెడ్మాస్టర్‌కు గతంలో అనేకసార్లు ఉత్తమ అవార్డు
మహబూబాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): విద్యా బోధనతో సమాజ నిర్దేశకు లుగా, మెరుగైన సమాజ నిర్మాతలుగా నిలవాల్సిన ఉపాధ్యాయుల్లో కొందరు తప్పుడు మార్గాల్లో పయనిస్తూ ఉపాధ్యాయ వృత్తికి కలంకంగా మారుతున్నారు. 35 ఏళ్ల పాటు విద్యా బోధన చేసి ఉద్యోగ విరమణ చేస్తున్న తమ సహచర ఉపాధ్యాయుడికి ప్రభుత్వం నుంచి రావాల్సిన అలవెన్స్‌లను ఇప్పించడానికి అవసరమైన ఫైల్ ఫుట్ అప్ చేయడానికి ఇద్దరు ఉపాధ్యాయులు ఏకంగా రూ.45 వేల లంచం డిమాండ్ చేశారు.
అంత ఇచ్చుకోలేని ఆ ఉపాధ్యాయున్ని చివరకు 15వేలు ఇవ్వాలంటూ ఒప్పందం చేసుకున్నారు. వీరి అవినీతిని సహించలేక బాధిత ఉపాధ్యాయుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించా డు. రూ.15వేల లంచం పుచ్చుకుంటూ మహబూబాబాద్ జిల్లా గూడూరు మం డలం అయోధ్యపురం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల హెడ్మాస్టర్, ఇన్‌చార్జి ఎంఈఓ రవికుమార్, అతని సహచర ఉపాధ్యాయు డు చంద్రమౌళి బుధవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
వరంగ ల్ ఏసీబీ డీఎస్‌పీ సాంబయ్య కథనం ప్రకా రం.. గూడూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన పాఠశాల ఉపాధ్యాయుడు ఈ నెలలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. అతనికి ప్రభుత్వం నుంచి రావలసిన పెన్షన్, ఇతర అలవెన్స్‌లు మంజూరు చేయడానికి అవసరమైన పత్రాలను రూపొందించి ఇవ్వడానికి క్లస్టర్ హెడ్మాస్టర్, ఇన్‌చార్జి ఎంఈఓ రవికుమార్ సంతకాలు చేయాల్సి ఉంది.
అయితే మూడు నెలలుగా అతనికి సంబంధించిన పత్రాలను తయారు చేసి ఇవ్వడానికి ఇన్‌చార్జి ఎంఈఓ రవికుమార్ రూ.45వేలు లంచం డిమాండ్ చేశారు. అయితే ‘నేను అంతగా ఇచ్చుకోలేను’అని ఆ ఉపాధ్యాయుడు చెప్పగా చివరకు రూ.15 వేలు ఇవ్వాలని, పదివేలు ఎంఈఓకు, తనకు రూ.5000 ఇవ్వాలి’ అని స్కూల్ అసిస్టెంట్ చంద్రమౌళి సదరు ఉపాధ్యాయుడికి చెప్పా డు. లంచం ఇవ్వడానికి ఇష్టం లేని సదరు ఉపాధ్యాయుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
దీనితో బుధవారం రవికుమార్, చంద్రమౌళికి బాధిత ఉపాధ్యాయుడు రూ.15 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరు టీచర్లను అదుపులోకి తీసుకున్నామని, గురువారం ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ తెలిపారు. ఇందులో విశేషం ఏమిటంటే ఏసీబీకి పట్టుబడ్డ రవికుమార్ పలుమార్లు ఉత్తమ ఉపా ధ్యాయుడిగా ప్రభుత్వం ద్వారా ప్రశంసాపత్రాలు అందుకోవడం గమనార్హం.




