టెండర్లలో బీసీలకు 42శాతం ఇవ్వాలి
- రిజర్వేషన్లు ఇవ్వకుంటే గుద్ది గుంజుకుంటాం
- అగ్రకుల రెడ్డి ప్రభుత్వానికి గోరీ కడతాం
- సీఎం రేవంత్ ఆరు గ్యారెంటీల పేరిట మోసం చేస్తుండు
- తెలంగాణలో వచ్చేది ఇక బీసీల రాజ్యమే
- ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నాలో టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
ముషీరాబాద్, ఏప్రిల్ 8(విజయక్రాంతి): ప్రభుత్వ టెండర్లలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే ఈ అగ్రకుల రెడ్డి ప్రభుత్వానికి గోరి కడతామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హెచ్చరించారు. ఇది బీసీ కాంట్రాక్టర్ల ఆత్మ గోస అని, అన్యాయం జరిగితే కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి, బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామన్నారు. రిజర్వేషన్లు ఇవ్వకుంటే గుద్ది గుంజుకుంటామని హెచ్చరించారు.
బీసీ కాంట్రాక్టర్లపై జరుగుతున్న అన్యాయంపై తీవ్రస్థాయిలో ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ కాం ట్రాక్టర్లలందరికీ ప్రభుత్వ టెండర్లలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ బీసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కు రాష్ట్ర నలుమూలల నుంచి బీసీ కాంట్రాక్టర్లు భారీగా తరలివచ్చారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ బీసీలకు కాంట్రాక్టులు ఇవ్వకుండా ఏ కోర్టు అడ్డుకుంటుంది? అని ప్రశ్నిస్తూ, చట్టం అడ్డంకి కాదని, ప్రభు త్వం కావాలనే బీసీలను, బీసీలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తోందని విమర్శించారు. ఎవరి కోసం అయితే తెలంగాణ ఆగమైందో, ఎవరి వల్ల అయితే నాశనం అయ్యిందో తెలంగాణ బిడ్డలు ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా ఆత్మహత్యలు చేసుకొని చనిపోతే ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లు మాత్రం వీళ్ల ఆత్మలు శాంతించాలని అమరవీరుల స్తూ పం వద్ద దీపం పెట్టుకుంటున్నారని మండిపడ్డారు.
అమరవీల స్తూపం కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లే కట్టాలా అని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను చంపి, చంపినోడే సంతాప సభ పెట్టి అన్యాయంగా చనిపోయినట్లుందన్న చందంగా ఆంధ్ర కాంట్రాక్టర్ల వ్యవహారం ఉందని మండిపడ్డారు. ఇదే కాంట్రాక్టర్లు ఇదే దోపిడీదారులు, పెట్టుబడిదారులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను చం పి అమరవీరుల దీపం అని ఒకటి పెట్టి పోయిండ్రని ఆరోపించారు. బీసీలకు వాటా రాకపోతే అమరవీరుల స్తూపం కంటే ఇం కొక అయిదారు అడుగుల ఎత్తులో గోరి కట్టిస్తామని హెచ్చరించారు.
బీసీ కాంట్రాక్టర్లం తా ఐక్యంగా ఉండాలని, వచ్చేది బీసీ రాజ్యమేనని, బీసీలను పెద్ద కాంట్రాక్టర్లుగా దిద్దే బాధ్యత తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పునర్నిర్మాణం పేరిట గతంలో కేసీఆర్ బీసీల బతుకుల మారుతాయన్నాడని, కానీ ఏమీ మారలేదని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం అం టూ ఆంద్రోళ్లకు కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు.
కేసీఆర్ అట్లుంటే, ఇక రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చి ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలను అనేక రకాలుగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోతే ప్రజలే ప్రభు త్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు.
ఈ ప్రభుత్వానికి గోరి కట్టేది బీసీ కాంట్రాక్టర్లే అని, ఎన్ని ఏళ్ల పాటు బీసీలను, బీసీ కాంట్రాక్టర్లను ఇంద్ర పార్క్‌లో ధర్నాలో కూర్చో బెట్టారు.. రేపటి బీసీ ప్రభుత్వంలో రెడ్డి, వెలమ కాంట్రాక్టర్లను ధర్నాలో కూర్చోబెడతాం. ఇందిరా పార్క్ వేదికగా చెబుతున్నా.. ఇక మీకు శంకరగిరి మాన్యాలే అని తీన్మార్ మల్లన్న హెచ్చరించారు.
రెడ్డి వర్గానికి చెందిన కాంట్రాక్టర్లకే పనులు
ఇంకా నాలుగు రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడో ఏడాది పూర్తవుతోంది. కానీ బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని తీన్మార్ మల్లన్న విమర్శించారు. రాష్ట్రంలోని ప్రధాన కాంట్రాక్టులు రెడ్డి, వెలమ వర్గాలకే కేంద్రీకృతమవుతున్నాయని, ముఖ్యంగా రెడ్డి వర్గానికి చెందిన కాంట్రాక్టర్లకే ఎక్కువగా పనులు అప్పగిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ కాంట్రాక్టర్లను కావాలనే పక్కన పెట్టి, వారికి పనులు ఇవ్వకుండా, చేసిన పనులకు బిల్లులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మల్లన్న గారు తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రభుత్వం బీసీ కాంట్రాక్టర్లను గోస పెడుతోందని అన్నారు.
రెడ్లు, వెలమలతో మనకు సోపతి వద్దు
‘కేసీఆర్‌ను గద్దె దించడానికి నాకు 10 సంవత్సరాలు పట్టింది. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి 10 నెలలు కూడా పట్టదు’ అంటూ తీన్మార్ మల్లన్న వ్యంగ్యాస్త్రాలను సంధించారు. ఇది పాత తెలంగాణ కాదని, ఇప్పుడు ఎదురు తిరిగి తన్ని తరిమికొట్టేలా తెలంగాణ బీసీలంతా ఒక్కటయ్యారని స్పష్టం చేశారు. బీసీ కాంట్రాక్టర్లకు ధైర్యం ఇస్తూఇక భయపడాల్సిన పనిలేదని, బీసీలకు ధైర్యం వచ్చిందని, ఇక యుద్ధమేనని, రెడ్లు వెలమలతో మనకు సోపతి వద్దని పిలుపునిచ్చారు.
హమారా హిస్సా, హమారా ఇజ్జత్, హమారా హుకూమత్ అనే నినాదంతో తెలంగాణ రాజ్యాధి కార పార్టీతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకొస్తూరేవంత్ రెడ్డి గల్లా పట్టి అయినా 42శాతం రిజర్వేషన్ సాధిస్తా. ఇది మల్లన్న శపథం అని ప్రకటించారు. గద్దర్ చెప్పినట్లుగా గుద్ది గుంజుకుందామని, ఇక అడుక్కునేది లేదని, పోరాడి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
తీన్మార్ మల్లన్న నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇక నుంచి అన్యాయం చేసే రెడ్డి, వెలమ కాంట్రాక్టర్ల భరతం పడతామని అన్నారు. బీసీ ప్రజాప్రతినిధులకు కూడా హెచ్చరిక జారీ చేస్తూ ‘మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా కూర్చొని మౌనం పాటిస్తే.. ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఇవే మీకు చి వరి ఎన్నికలు అవుతాయి’ అని పేర్కొన్నారు.
బీసీ కాంట్రాక్టర్లను పట్టించుకోని కాంగ్రెస్
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు సుంకరి సత్తయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటి సాయికిరణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కాంట్రాక్టర్లను పట్టించుకోవడం లేదని నిప్పులు చెరిగారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ప్రతి టెండర్ నోటీసులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలు ఆర్థికంగా ఎదిగితే తమ ఆధిపత్యా నికి ఎక్కడ గండిపడుతుందనే కుట్రతోనే ప్రభుత్వం కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు ఇవ్వడం లేదని ఆరోపించారు.
బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదని, తక్షణ మే జీవో విడుదల చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. బీసీ కాంట్రాక్టర్ల న్యాయమైన పోరాటానికి ప్రభుత్వం దిగిరావాలని లేనిపక్షంలో సచివాలయ ముట్టడికి కూడా వెనకాడబోమని వారు హెచ్చరించారు. ఈ మహా ధర్నాలో అసోసియేషన్ ప్రధానకార్యదర్శి ఎస్.భాస్కరరావు, కోశాధికారి గాజుల భాస్కర్, ఉపాధ్యక్షుడు పట్నం శ్రీశైలం, సలహాదారు ఆర్.హనుమాన్ సాగర్‌తో పాటు వందలాది మంది బీసీ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.




