పక్కగా ఇండ్ల గణన బ్లాక్ తయారు చేయాలి
కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, ఏప్రిల్ 8 (విజయ క్రాంతి) : పక్కగా ఇండ్ల గణన బ్లాక్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో జనగణన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. జనగణలో భాగంగా పక్కాగా ఇండ్ల గణనా బ్లాకులు తయారు చేయాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో 9 మంది అధికారులు టీం గా ఏర్పడి క్లస్టర్ లో జరుగుతున్న గణనలో పలు సందేహాలు నివృత్తి చేస్తారని తెలిపారు. జనాభా, గ్రామ, మండల, పట్టణ, సరిహద్దుల పై పలు సూచనలు చేస్తారని తెలిపారు.
టీం సభ్యులు, జనాభా గణాంక అధికారులు సమన్వయంతో ఇండ్ల గణన బ్లాక్ లిస్ట్ను పక్కగా తయారు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఈడియం సందీప్, తహాసిల్దారులు, గణాంక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




