9 April, 2026 | 2:04 AM

ఏసీబీ వలలో సీఐ, ఎస్సై

09-04-2026 12:07 AM

ఫేక్ సర్టిఫికెట్ కేసులో చార్జి షీటు దాఖలుకు 15 లక్షలు  డిమాండ్

రూ.5 లక్షలకు ఒప్పందం

  2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన శంషాబాద్ ఎయిర్ పోర్టు ఔట్ పోస్ట్ ఠాణా సీఐ కనకయ్య, ఎస్సై సిద్దేశ్వర్

రాజేంద్రనగర్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి) : రాజేంద్రనగర్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని శంషాబాద్ ఎయిర్ పోర్టు ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ లో అవినీతి నిరోధక శాఖ(ఏసిబి) అధికారులు  దాడులు నిర్వహించారు. రూ 2 లక్షల లంచం తీసుకుంటున్న ఇన్ స్పెక్టర్ కనకయ్య, ఎస్సై సిద్దేశ్వర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ దాడులు మంగళవారం సాయం త్రం ప్రారంభమై అర్ధరాత్రి వరకు కొనసాగాయి. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డిఎస్పి ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన ఒక వ్యక్తి ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ తో ప్రయాణించేందుకు ప్రయత్నిస్తూ ఇటీవల పట్టుబడ్డాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టు ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. అతడిని రిమాండ్ కు తరలించారు. జైలు నుంచి రిలీజ్ అయ్యాడు.

ఈ నేపథ్యంలో అతడు ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ కు హాజరవుతున్నాడు. ఈ కేసులో చార్జి షిట్ దాఖలు చేయడానికి ఇన్ స్పెక్టర్ కనకయ్య, ఎస్సై సిద్దేశ్వర కలిసి బాధితుని నుంచి 15 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అదేవి ధంగా బాధితుడి కుటుంబ సభ్యులను కూడా చార్జ్ షిట్‌లో చేరుస్తామని బెదిరించారు. తాను పదిహేను లక్షలు చెల్లించలేనని తెలిపిన బాధితుడు, చివరకు 5 లక్షల ఇస్తానని పోలీసులతో ఒప్పందం కొలుచుకున్నా డు.

అనంతరం ఈ విషయం ఏసీబీ అధికారులకు తెలియజేయడంతో వారు పక్కా ప్రాణాలికతో ఉచ్చు బిగించారు. మొదటి విడతగా మంగళవారం సాయంత్రం బాధితుడు రూ.2 లక్షలు నగదు తీసుకొని శం షాబాద్ ఎయిర్ పోర్ట్ ఔట్ పోస్ట్  పోలీస్ స్టేషన్ కు వెళ్లగా, ఆ మొత్తాన్ని స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఇన్ స్పెక్టర్ ఎస్సైలను రెడ్ హ్యాం డెడ్‌గా పట్టుకున్నారు.