30 May, 2026 | 11:24 PM

Breaking News

ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు   •   ఖాతాదారుల సేవా కేంద్రం నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం   •   గిరిజన యువతీ యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం   •   మండల టాపర్‌ మేకా మాన్వితకు ట్రిపుల్ ఐటీ సీటు   •   పెద్దమల్లారెడ్డిలో అగ్నిప్రమాదం.. గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధం   •   వరికొయ్యలు కాల్చవద్దు... బహిరంగ వ్యర్ధాలు కాల్చవద్దు   •   కూచిపూడి నృత్యంతో అలరించిన మోక్ష ధృతి   •   అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలి: సీడీపీవో జ్యోతి   •   ఘట్కేసర్ లో ప్రారంభమైన సిపిఎం శిక్షణ తరగతులు   •   రైతు డిస్కమ్ రైతాంగానికి శాపం   •  

ఆయుశ్ షెట్టి సంచలనం: వరల్డ్ నెం.7 ఫెంగ్‌పై అద్భుత విజయం

09-04-2026 01:44 AM
  1. వరల్డ్ నెం.7 ఫెంగ్‌కు షాక్

బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్

చైనా, ఏప్రిల్ 8 : భారత షట్లర్లు బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో అదరగొ డుతున్నారు. యువ సంచలనం ఆయుశ్ షెట్టి, వరల్డ్ నెం.7, హాంకాంగ్ ఓపెన్ ఛాంపియన్ లిషి ఫెంగ్‌కు షాకిచ్చాడు. అద్భుత ప్ర దర్శనతో అతన్ని ఓడించాడు. 51 నిమిషాల పాటు సాగిన పోరులో ఆయుశ్ షెట్టి 21 13,21 స్కోరుతో ఫెంగ్‌పై విజయం సాధించాడు. రెండు సెట్లలోనూ ఆరంభం లో వెనుకబడి ఆయుశ్ తర్వాత అద్భుతంగా పుంజుకుని సంచలన విజయం అందుకున్నాడు.

అటు పురుషుల సింగిల్స్‌లో మరో భారత ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. ప్రణయ్ 24 21 స్కోరుతో వియాత్నాంకు చెందిన డాంగ్‌పై గెలుపొందాడు. అలాగే మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు కూడా ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. గంటా 7 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో సింధు 15 21,21 21 స్కోరుతో సింధు విజ యం సాధించింది.