22 April, 2026 | 1:14 PM

Breaking News

ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •  

గుజరాత్ థ్రిల్లర్ విక్టరీ: ఢిల్లీపై 1 పరుగుతో గెలుపు.. మిల్లర్ పోరాటం వృథా

09-04-2026 01:52 AM

విజయానికి 2 ఓవర్లలో 36 పరుగులు చేయాలి. క్రీజులో ఉన్నది సఫారీ కిల్లర్ మిల్లర్.. విధ్వంసం మొదలైంది. సిరాజ్ వేసిన 19వ ఓవర్లో మిల్లర్ సునామీలా విరుచుకుపడ్డాడు. ఏకంగా 23 పరుగులు రాబట్టాడు. ఫలితంగా చివరి ఓవర్లో చేయాల్సింది 13 పరుగులే.. అందులో మొదటి 4 బంతులకు 11 రన్స్ వచ్చేసాయి. ఇంకేముంది ఢిల్లీ హ్యాట్రిక్ విజయం అనుకున్నారంతా.. కానీ ఐదో బంతికి మిల్లర్ సింగిల్ నిరాకరించగా..చివరి బంతిని ప్రసిద్ధ కృష్ణ పరుగులేమీ ఇవ్వకపోవడంతో గుజరాత్ 1 పరుగుతో గట్టెక్కి సీజన్ లో తొలి విజయాన్ని అందుకుంది.

  1. ఉత్కంఠ పోరులో ఢిల్లీ ఓటమి

1 పరుగుతో గెలిచిన టైటాన్స్

మిల్లర్ విధ్వంసం వృథా

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8 : ఐపీఎల్ 19వ సీజన్ కు ఊపొచ్చింది. ఉత్కంఠ మ్యాచ్ లు లేవంటూ నిరాశపడుతున్న అభిమానులను గుజరాత్, ఢిల్లీ మ్యాచ్ టెన్షన్ పెట్టిం ది. చివరి బంతి వరకూ ఆధిపత్యం చేతులు మారుతూ సాగిన ఈ పోరులో గుజరాత్ టైటాన్స్ ఒక పరుగుతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. ఈ మ్యాచ్ టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫామ్‌లో ఉన్న సాయి సుదర్శన్ త్వరగానే ఔటైనప్పటకీ బట్లర్, కెప్టెన్ గిల్ మెరుపు ఇన్నింగ్స్ లు ఆడడంతో గుజరాత్ టైటాన్స్ స్కోరు వేగం టాప్ గేర్ లో సాగింది.

latest sports updates కోసం ఇక్కడ చూడండి

ముఖ్యంగా బట్లర్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.కేవలం 27 బంతుల్లో 52 (3 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులు చేశాడు. అటు గిల్ కూడా దూకుడుగా ఆడుతూ భారీ స్కోరే లక్ష్యంగా విధ్వంసం సృష్టించాడు. బట్లర్ , గిల్ రెండో వికెట్ కు 60 పరుగులు జోడించారు. గిల్ 45 బంతుల్లో 70 (4 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో వాషింగ్టన్ సుందర్ కూడా చెలరేగిపోయాడు. గత రెండు మ్యాచ్ లలో విఫలమైన సుందర్ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

కేవలం 32 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు.గిల్‌తో కలిసి వాషింగ్టన్ సుందర్ మూడో వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఢిల్లీ బౌలర్లలో ఎంగిడి తప్పిస్తే మిగిలిన వారంతా విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 210 పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మంచి ఆరంభమే దక్కింది. ఫామ్‌లో ఉన్న నిస్సాం క దూకుడుగా ఆడి తొలి వికెట్‌కు రాహుల్ తో కలిసి 76 పరుగులు జోడించాడు.

నిస్సాంక (41) ఔటైన తర్వాత ఒకే ఓవర్లో రషీద్ ఖాన్ తన స్పిన్ మాయాజాలాన్ని చూపించాడు. 10వ ఓవర్ చివరి రెండు బంతులకు వరుసగా నితీష్ రాణా రిజ్విలను ఔట్ చేశాడు. అయితే ఫామ్ అందుకున్న కేఎల్ రాహుల్ మాత్రం పోరాడాడు. 52 బంతుల్లో 92 ( 11 ఫోర్లు, 4 సిక్సర్లు)  పరుగులకు ఔటై సెంచరీ చేజార్చుకున్నాడు. రాహుల్ కీలక సమయంలో ఔటైనా డేవిడ్ మిల్లర్ మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 19వ ఓవర్లో సిరాజ్ కు చుక్కలు చూపించాడు. బౌండరీలు, ఫోర్లతో విరుచుకుపడి మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చే శాడు.

సిరాజ్ ఓవర్లో ఏకంగా 23 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో సైతం ఢిల్లీ దాదాపుగా గెలిచినట్టే అనుకున్నారు. ఐదో బంతికి మిల్లర్ సింగిల్ తీయకపోగా.. చివరి బంతికి పరుగులేమీ రాకపోవడంతో గుజరాత్ 1 పరుగు తేడాతో గెలిచింది. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇదే తొలి పరాజయం. అటు తాజా గెలుపుతో గుజరాత్ తన గెలుపు ఖాతాను ఓపెన్ చేసింది.

స్కోరు బోర్డు 

గుజరాత్ టైటాన్స్ : 210/4 ( గిల్ 70, బట్లర్ 52, వాషింగ్టన్ సుందర్ 55 ; ముకేశ్ కుమార్ 2/55, ఎంగిడి 1/24 )

ఢిల్లీ క్యాపిటల్స్ : 209/8 ( కెఎల్ రాహు ల్ 92, నిస్సాంక 41, మిల్లర్ 41 నాటౌట్ ; రషీద్ ఖాన్ 3/17, ప్రసిద్ధ కృష్ణ 2/52)


ఇవి కూడా చదవండి: