22 April, 2026 | 2:24 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

ఈడెన్‌లో కేకేఆర్ vs లక్నో ఫైట్: తొలి గెలుపు కోసం కోల్‌కతా పోరాటం

09-04-2026 01:49 AM

ఈడెన్ వేదికగా లక్నోతో ఫైట్

ఇప్పటి వరకూ గెలుపు ఖాతా తెరవని కేకేఆర్

గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై గెలిచిన లక్నో

కోల్‌కతా, ఏప్రిల్ 8: ఐపీఎల్ 19వ సీజన్‌ లో కొన్ని జట్లు అంచనాలు తగ్గట్టే ఆడుతుండగా.. మరికొన్ని మాత్రం ఇంకా అంచ నాలు అందుకోలేదు. వాటిలో కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా ఉంది. ప్రస్తుత సీజన్ మొదలై 10 రోజులు దాటిపోయినా ఇప్పటి వరకూ గెలుపు రుచి చూడని కోల్‌కతా నైట్ రైడర్స్ నాలుగో మ్యాచ్‌కు సిద్ధమైంది. గురువారం హోంగ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడబోతోంది.

గత మ్యాచ్ వర్షంతో రద్దవడంతో ఎట్టకేలకు పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచిన కేకేఆర్ స్థాయికి తగిన ప్రదర్శన కనబరచడం లేదు. అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్లంతా ఫెయిలవుతున్నారు. ముఖ్యంగా మినీ వేలం లో రూ.25.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్ మూడు మ్యాచ్‌లో నూ ఫ్లాప్ అయ్యాడు. కేవలం 24 పరుగులే చేసిన గ్రీన్ ఫిట్ నెస్ సమస్యలతో బౌలింగ్ కూడా వేయలేదు. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి అనుమతి రావడంతో తర్వాతి మ్యాచ్‌లలో గ్రీన్ బౌలింగ్ కూడా వేసే అవకాశముంది. అలాగే రహానే, రఘువంశీ తప్పిస్తే మిగిలిన బ్యాటర్లంతా ఫామ్ లోకి రావాల్సి ఉంది.

ఫిన్ అలెన్, రింకూ సింగ్, రమణ్ దీప్ సింగ్ ఇంకా పూర్తి ఫామ్‌లోకి రాలేదు. ముఖ్యంగా ఫినిషర్ రింకూసింగ్ పై కోల్‌కతా చాలా ఆశలు పెట్టుకుంది. గతీ సీజ న్‌లో సైతం పెద్దగా మ్యాచ్ విన్నింగ్ ఇన్నిం గ్స్‌లు ఆడని రింకూ ఈడెన్‌లోనైనా దుమ్మురేపుతాడేమోనని కేకేఆర్ ఫ్యాన్స్ ఎదురుచూ స్తున్నారు. అలాగే గ్రీన్ తనపై ఉన్న అంచనాలు అందుకుంటాడేమో చూడాలి. అటు బౌలింగ్‌లోనూ కీలక బౌలర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి వైఫల్యం కేకేఆర్ కు ఇబ్బందిగా మారింది.

నరైన తన స్పిన్ మ్యాజిక్ చూపించి చాలా ఏళ్ళయింది. అలాగే మిస్టర్ స్పిన్నర్ గా పేరున్న వరుణ్ చక్రవర్తి వికెట్లు తీయడం మరిచిపోయాడన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. బంతితో ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్న వరుణ్ గత మ్యాచ్‌కు గాయంతో దూరమయ్యాడు. అలాగే నరైన్ స్థానంలో రోవమన్ పావెల్‌ను తీసుకున్నారు. ప్రస్తుతం ఇదే కాంబినేషన్‌ను కొనసాగించే అవకాశముంది. మరోవైపు తొలి మ్యా చ్‌లో ఓడినా రెండో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించిన లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది.

మార్కరమ్, రిషబ్ పంత్ ఫామ్ లోకి రావడం, బౌలర్లు సమిష్టిగా రాణించడం లక్నోకు మొదటి విజయాన్ని అందించాయి. ఇప్పుడు ఈడెన్ గార్డెన్స్‌లోనూ అదే జోరు కొనసాగించాలని లక్నో ఎదురుచూస్తోంది. లక్నో బ్యాటింగ్ గో మిఛెల్ మార్ష్, నికోలస్ పూరన్ కూడా అంచనాలకు తగ్గట్టుగా రాణి స్తే తిరుగుండదు. ఆయుశ్ బదౌనీ, అబ్దుల్ సమద్ కూడా చివర్లో మెరుపులు మెరిపించాల్సిన అవసరం ఉంది. అటు బౌలింగ్ లో మహ్మద్ షమీ అదరగొడుతున్నాడు. సన్ రైజర్స్ పై కేవలం 9 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. అతనితో పాటు ప్రిన్స్ యా దవ్, అవేశ్ ఖాన్ కూడా రాణిస్తున్నారు. 

పిచ్ రిపోర్ట్ 

మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న ఈడెన్ గార్డెన్స్ లో ఛేజింగ్ జట్టుకు విజయావకాశాలుంటాయి. అయితే ఈ మ్యాచ్ కు బ్యాలెన్సింగ్ పిచ్‌ను రూపొందిస్తున్నట్టు సమాచారం. 

గత రికార్డులు 

ఇరు జట్లు 6 సార్లు తలపడగా నాలుగు మ్యాచ్‌లలో లక్నోనే గెలిచింది. రెండింటిలో మాత్రమే కోల్‌కతా విజయం సాధించింది.

తుది జట్లు అంచనా 

కోల్‌కతా నైట్‌రైడర్స్: ఫిన్ అలెన్, రహానే (కెప్టెన్), గ్రీన్, రఘువంశీ, రింకూ సింగ్, రమణ్‌దీప్‌సింగ్, నరైన్, అంకుల్ రాయ్, నవదీప్ శైనీ, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి/ముజరబానీ

లక్నో సూపర్‌జెయింట్స్: మిఛెల్ మార్ష్, మాక్రమ్, పంత్(కెప్టెన్), పూరన్, బదౌనీ, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరీ, సిద్ధార్థ్, అనేశ్ ఖాన్, షమీ, దిగ్వేశ్


ఇవి కూడా చదవండి:

గుజరాత్ థ్రిల్లర్ విక్టరీ: ఢిల్లీపై 1 పరుగుతో గెలుపు.. మిల్లర్ పోరాటం వృథా

ధోనీకి ఇంకా ఫిట్‌నెస్ సమస్య.. ఢిల్లీ మ్యాచ్‌కు దూరం అయ్యే అవకాశం

ఆయుశ్ షెట్టి సంచలనం: వరల్డ్ నెం.7 ఫెంగ్‌పై అద్భుత విజయం

అనుభవాధారిత విద్యను అందించడమే లక్ష్యం

జైస్వాల్-వైభవ్ విధ్వంసం: రాజస్థాన్ హ్యాట్రిక్ విజయం… ముంబైకి వరుస షాక్ ఓటమి!

షూటింగ్ వరల్డ్‌కప్‌లో భారత్ సంచలనం: పాలక్-ముకేశ్ గోల్డ్… వరల్డ్ రికార్డ్ బ్రేక్!

బుమ్రా Vs 15ఏళ్ల వైభవ్.. ముంబై-రాజస్థాన్ మ్యాచ్‌లో అసలైన ఫైట్ ఇదే!