9 April, 2026 | 3:52 AM

సీజ్‌ఫైర్

09-04-2026 01:30 AM

పశ్చిమాసియా యుద్ధానికి తాత్కాలిక బ్రేక్

రెండువారాల పాటు కాల్పుల విరమణ

  1. ఇరాన్ 1౦ షరతులకు అమెరికా అంగీకారం 
  2. కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ గల్ఫ్ దేశాలపై క్షిపణులు 
  3. లావన్ దీవిపై దాడికి ప్రతిగా దాడులు చేశామని ఇరాన్ స్పష్టీకరణ..
  4. మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు మండిపాటు.. మళ్లీ హోర్ముజ్ క్లోజ్
  5. ఇరాన్‌కు ఆయుధాలిస్తే 50% సుంకాలు: ట్రంప్ హెచ్చరికలు 

* 40 రోజులు.. దాదాపు ౪ వేల మరణాల తర్వాత, రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అమెరికా, ఇరాన్ బుధవారం ప్రాధమికంగా అంగీకారానికి వచ్చాయి. ఇరా న్ నాగరికతను తుడిచేస్తామని భీషణ ప్రతిజ్ఞ చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తను విధించిన గడువుకు ౯౦ నిమిషాల ముందు సీజ్ ఫైర్ నిర్ణయం తీసుకున్నారు. కాల్పుల విరమణకు ఇరాన్ విధించిన 1౦ షరతులపై అమెరికా సానుకూలంగా స్పందించింది.

మరోవైపు, అమెరికా ప్రతిపాదించిన 15 అంశాలను సమీక్షిస్తున్నట్లు ఇరాన్ స్పష్టంచేసింది. హోర్ముజ్ జలసంధిలో నౌకల రవా ణా నియంత్రణ తమ సైన్యం పరిధిలోనే ఉంటుందని స్పష్టంచేసింది. జలసంధిని దాటే ప్రతి నౌకపై సుమారు 2 మిలియన్ డాలర్ల రవాణా రుసుము వసూలు చేస్తామని స్పష్టం చేసింది.

అయితే లావన్ చము రు శుద్ధి కర్మాగారంపై తాజాగా అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులకు నిరసనగా ఇరాన్ యూఏఈ, కువైట్ దేశాలపై క్షిపణుల వర్షం కురిపించింది. అలాగే, సౌదీ అరేబియాలోని ఈస్ట్-వెస్ట్ ఆయిల్ పైప్‌లైన్‌నూ ఇరాన్ సైన్యం ధ్వంసం చేసింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుండటంతో హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ తాజాగా ప్రకటించింది.

వాషింగ్టన్/టెహ్రాన్, ఏప్రిల్ ౭: అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తాత్కాలికంగా సద్దుమణిగాయి. రెండు వారాల పా టు కాల్పుల విరమణకు బుధవారం ఇరు దేశాలు అంగీకరించాయి. దీంతో 4౦ రోజులుగా కొనసాగుతున్న భీకర పోరుకు తాత్కా లిక విరామం లభించింది. ఇరాన్‌కు ట్రంప్ విధించిన గడువుకు ౯౦ నిమిషాల ముందు కాల్పుల విరమణ (సీజ్ ఫైర్) నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇరాన్ ప్రతిపాదించిన ౧౦ అంశాలకూ అమెరికా సానుకూలంగా స్పందించింది.

మరోవైపు, అమెరికా ప్రతిపాదించిన 15 అంశాలను సమీక్షిస్తున్నట్లు ఇరా న్ స్పష్టం చేసింది. హోర్మూజ్ జలసంధిని తెరిచేందుకూ అంగీకరించింది. అయితే, నౌక ల రవాణా నియంత్రణ తమ సైన్యం పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దాడుల హెచ్చరికలను వెనక్కి తీసుకున్నారు. హోర్ము జ్ జలసంధిని తక్షణం తెరిస్తేనే సీజ్‌ఫైర్ అమలవుతుందని షరతు విధించారు.

సీజ్‌ఫైర్ తర్వాత ఇరాన్‌కు ఆయుధ సంపత్తిని సమకూర్చే దేశాలపై ౫౦శాతం సుంకా లు విధిస్తామని ప్రకటించారు. మరోవైపు, సీజ్‌ఫైర్ అమలులో ఉన్నప్పటికీ కువైట్, యూఏ ఈ, సౌదీపై క్షిపణుల దాడులు చేసిం ది. తమ దేశంలోని లావన్ చమురు శుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దా డులకు ప్రతిగా, తాము గల్ఫ్ దేశాలపై దాడులకు పాల్పడినట్లు స్పష్టం చేసింది. మరో వైపు, అమెరికా కాల్పుల విరమణను తాము స్వాగతిస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.

అయి తే, ఆ కాల్పుల విరమణ లెబనాన్‌కు వర్తించదని స్పష్టం చేశారు. తాము లెబనాన్‌ను వది లిపెట్టబోమని, దాడులు కొనసాగుతూనే ఉంటాయని ప్రకటించారు. హెజ్బుల్లా స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేసేవరకూ యు ద్ధం సాగుతుందని తేల్చిచెప్పారు. ఈ ప్రకటన వెలువడిని కొద్ది గంటలకే లెబనా న్‌లోని ౧౦౦ చోట్ల ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. దాడుల్లో వందలాది మంది మృతిచెందారు. వేలల్లో క్షతగాత్రులయ్యారు. 1982 తర్వాత తమ దేశంపై జరి గిన అతిపెద్ద దాడి ఇదేనని లెబనాన్ ప్రభు త్వం ప్రకటించింది.

జలసంధిపై నియంత్రణపై ఇరాన్ పట్టు

కాల్పుల విరమణకు తాము అంగీకరించినప్పటికీ హోర్ముజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగుతుందని ఇరాన్ ఖరాకండిగా తేల్చిచెప్పింది. జలసంధి గుండా వెళ్లే నౌకలను తమ సైన్యమే పర్యవేక్షిస్తుందని హుకుం జారీ చేసింది. జలసంధిని దాటే ప్రతి నౌకపై సుమారు 2 మిలియన్ డాలర్ల రవాణా రుసుము (ట్రాన్సిట్ ఫీజు) వసూ లు చేస్తామని స్పష్టం చేసింది. ఈ ఆదాయా న్ని పొరుగు దేశమైన ఒమన్‌తో పంచుకోవడంతోపాటు యుద్ధంలో దెబ్బతిన్న తమ దేశ పునర్నిర్మాణానికి వినియోగించుకుంటామని ప్రకటించింది.

ఇరాన్ ప్రతిపా దనలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సానుకూలంగా స్పందించడం గమనార్హం. కానీ, ఒమన్ మాత్రం హోర్ముజ్ జలసంధి నుంచి ట్రాన్సిట్ ఫీజు (రవాణా రుసుము) తమకు అవసరం లేదని ప్రకటించింది. ఇరాన్ ప్రతిపాదనను ఆ దేశం వ్యతిరేకించింది.ట్రంప్ కూడా జలసంధి నుంచి ట్రాన్సిట్ ఫీజులో వాటా కోరుకుంటున్నప్పటికీ, ఇరాన్ అందుకు ఒప్పుకునే అవకాశం లేదని అంతర్జాతీయవ విశ్లేషకులు చెప్తున్నారు.

ఇరాన్ ప్రాధేయపడింది: అమెరికా రక్షణశాఖ

కాల్పుల విరమణ కోసం ఇరాన్ ప్రాధేయపడిందని అమెరికా రక్షణ మంత్రి హెగ్సె త్ వ్యాఖ్యానించారు. తమ సైనికచర్యలు పటిష్ఠంగా సాగడం వల్లే ఇరాన్ వెనక్కి తగ్గిందని తెలిపారు. తమ సైన్యం నిమిషాల్లోనే ఆ దేశా న్ని నామరూపాల్లేకుండా చేయగలదని, కా నీ.. అమెరికా దయతో కాల్పుల విరమణకు అంగీకరించిందని వివరించారు. అమె రికా విధించిన షరతులకు ఇరాన్ ఒప్పుకోకపోతే మరింత తీవ్రంగా దాడులు జరిగేవని పేర్కొన్నారు.

మళ్లీ హోర్ముజ్ మూసివేత

లెబనాన్‌పై ఇజ్రాయెల్ చేపట్టిన వైమానిక దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండిం చింది. ఇజ్రాయెల్ దాడులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని తీవ్రంగా ఖండించింది. అంతేకాదు.. సీజ్‌ఫైర్ ఉల్లంఘనకు నిరసనగా మళ్లీ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన కొద్ది గంటలకే ఈ పరిణామం చోటుచేసుకోవడం అంతర్జాతీయం గా చర్చనీయాంశమైంది.

10న ఇస్లామాబాద్ భేటీ కీలకం

పశ్చిమాసియాలో శాంతిస్థాపన లక్ష్యంతో ఈనెల 10న పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో కీలకమైన దౌత్య సమావేశం జరగనుంది. అమెరికా, ఇరాన్ ప్రభుత్వాల తరఫున పలువురు ప్రతినిధులు భేటీలో పాల్గొంటారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వంలో ఇరుదేశాల ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించనున్నారు.

ఇరాన్‌ను వెంటనే వీడండి: భారత విదేశీ వ్యవహారాలశాఖ

అమెరికా--ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, మళ్లీ యుద్ధం ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. భారత్ అందు కే ఇరాన్‌లో ఉంటున్న 7 వేల మంది భారతీయుల విషయంలో అప్రమత్తంగా ఉంది. వారంతా వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వీడాలని భారత విదేశీ వ్యవహారాలశాఖ మార్గద ర్శకాలు జారీ చేసింది. ఇరాన్‌లోని భాతరత రాయబార కార్యాలయం అనుమతి లేకుం డా, ఎవరూ అంతర్జాతీయ సరిహద్దుల వద్దకు వెళ్లొద్దని హెచ్చరించింది. అత్యవసర సమయాల్లో ఇండియన్ ఎంబసీ ఎమర్జెన్సీ నంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది.

ఇరాన్‌కు ఆయుధాలిస్తే 5౦% సుంకాలు: ట్రంప్ 

రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొ నాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’లో కీల క పోస్ట్ పెట్టారు. ప్రపంచ శాంతికి ఇదో గొప్పరోజు అని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఇకపై కొత్త వెలుగులు ప్రసరి స్తాయని రాసుకొచ్చారు. ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ ప్లాంట్లు, కీలకమైన మౌలిక సదుపాయాలపై దాడులు చేయబోమని హామీ ఇచ్చారు. ఇరాన్‌తో పా టు ప్రపంచ దేశాలన్నీ యుద్ధం ముగిసిపోవాలని కోరుకున్నాయని తెలిపారు.

హోర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్‌కు అమెరికా సాయం చేస్తుందని వెల్లడించారు. ఇరాన్‌తో కుదిరిన తాత్కాలిక ఒప్పందం ఒక గొప్ప మార్పునకు సంకేతమని అభివర్ణించారు. ఇరాన్‌లో కొత్త పాలన ను అమెరికా స్వాగతిస్తున్నదని తెలిపారు. అలాగే, ఇరాన్‌కు ఇకపై ఆయుధాలను సరఫరా చేసే దేశాలకు 50 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు.

ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఉండవని తేల్చిచెప్పారు. ఇరాన్ తన తక్షణం బేషరతుగా యురేనియాన్ని శుద్ధి చేసే ప్రక్రి యను పూర్తిగా ఆపేయాలని హకుం విధించారు. ఇరాన్ అణు స్థావరాలు ప్ర స్తుతం తమ శాటిలైట్ల నిఘాలో ఉన్నాయని గుర్తుచేశారు. 

యుద్ధం ముగిసినట్లు కాదు: మొజ్తాబా ఖమేనీ

రెండు కాల్పుల విరమణకు అర్థం యు ద్ధం ముగిసినట్లు కాదని ఇరాన్ సు ప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ స్పష్టం చే శారు. తమ సైనిక చర్యలు, రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే అమెరికా వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. ఇది తమ చారిత్రక విజయమని ప్రకటించుకున్నారు. తాము ప్రతిపాదించిన 10 అంశాల ప్ర ణాళికలోని ప్రతి అంశంపై పూర్తిస్థాయి లో చర్చలు జరిగి, వందశాతం ఫలితా లు వచ్చే వరకు యుద్ధం ముగియదని స్పష్టం చేశారు. తమ చేతులు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉన్నాయని, శత్రువు చిన్న తప్పు చేసినా తాము తిప్పికొడతామని తేల్చిచెప్పారు. శత్రుదేశాల దురాక్రమణను ఉపేక్షించబోమని తెలిపారు.

ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాలు

యుద్ధం నిలిపివేత: ఇరాన్, ఇరాక్, లెబనాన్, యెమెన్.. వంటి అన్ని దేశాలపై తక్షణం దాడులను నిలిపివేయాలి. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తూ దాడులను శాశ్వతంగా ఆపేయాలి.

 హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభం: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని తక్షణం వాణి జ్య నౌకల కోసం తెరవడం. ఇరాన్ సైన్యం నియంత్రణలోనే జలసంధి ఉండాలనే షరతు

నౌకల  రక్షణ ప్రొటోకాల్: జలసంధి గుండా వెళ్లే నౌకల భద్రత, స్వేచ్ఛా రవా ణా కోసం ఇరాన్ సైనిక పర్యవేక్షణలో కొత్త ప్రొటోకాల్ .

టాన్సిట్  ఫీజు (రవాణా రుసుము): జలసంధి గుండా వెళ్లే ప్రతి నౌకకు సుమా రు 2 మిలియన్ల ట్రాన్సిట్ ఫీజు విధింపు. ఈ ఆదాయాన్ని ఒమన్‌తో పంచుకోవడమే కాకుండా, యుద్ధంలో దెబ్బతిన్న ఇరాన్ మౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి వినియోగం

 యూరేనియం సుసంపన్నత గుర్తింపు: ఇరాన్ అవసరాల కోసం యూరేనియం సుసంపన్నత పొందే హక్కును అమెరికాతోపాటు  ఇతర దేశాలూ గుర్తించాలి

 ఆంక్షల ఎత్తివేత: ఇరాన్‌పై విధించిన అన్నిరకాల ప్రాథమిక, ద్వితీయ ఆర్థిక ఆంక్షలన్నింటినీ అన్ని దేశాలు ఎత్తివేయాలి.

స్తంభింపజేసిన నిధుల విడుదల: అమెరికా, ఇతర దేశాల్లో ఉన్న ఇరాన్ నిధులను, ఆస్తులను తక్షణమే విడుదల చేయాలి. అన్ని విదేశీ బ్యాంకుల్లో సీజ్ అయిన ఇరాన్ నిధులను బేషరతుగా విడుదల చేయాలి.

 నష్టపరిహారం: యుద్ధం కారణంగా జరిగిన విధ్వంసానికి గాను ఇరాన్‌కు పూర్తిస్థాయిలో పునర్నిర్మాణ నిధులు లేదా నష్టపరిహారం చెల్లించాలి.

అమెరికా సైన్యం ఉపసంహరణ: పశ్చిమాసియాలోని అన్ని స్థావరాల నుంచి అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలి.

అంతర్జాతీయ ఒప్పంద భద్రత: పది సూత్రాలతో కూడిన ఒప్పందాన్ని ఐక్యరాజ్య సమి తి (ఐరాస) ఆమోదించాలి. తద్వారా ఇది అంతర్జాతీయ చట్టం ప్రకారం అమలు చేయాలి.

యూఏఈ, కువైట్‌పై ఇరాన్ క్షిపణులు

లావన్ చమురు శుద్ధి కర్మాగారంపై తా జాగా అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులకు నిరసనగా ఇరాన్ బుధవారం యూఏ ఈ, కువైట్ దేశాలపై క్షిపణుల వర్షం కురిపించింది. అలాగే, సౌదీ అరేబియాలోని ఈస్ట్-వె స్ట్ ఆయిల్ పైప్‌లైన్‌నూ ఇరాన్ సైన్యం ధ్వం సం చేసింది. హోర్ము జ్ జలసంధి మూతపడటంతో సౌదీకి ఈ పైప్‌లైనే ఎగుమతికి కీలకం. అలాంటి కీలకమైన పైప్‌లైన్‌ను ధ్వంసం చేయడాన్ని సౌదీ తీవ్రంగా ఖండించింది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొద్ది గంటల్లోనే గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు జరపడం ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేసింది.

కాల్పుల విరమణను స్వాగతిస్తున్నాం: భారత్

అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది. ఈ పరిణామం పశ్చిమాసియాలో శాం తికి అడు గులు పడతాయని ఆకాంక్షించింది. దేశాల మధ్య సమస్యలకు పరిష్కా రం దౌత్యపరమైన చర్చల ద్వారానే సాధ్యమవుతుందని ఉద్ఘాటించింది. నెలన్నర పాటు సాగిన యుద్ధం వల్ల అంతర్జాతీయ ఇంధన సరఫరా, వాణిజ్య నెట్‌వర్క్‌లు దెబ్బతిన్నాయని గుర్తు చేసింది. హోర్ముజ్ జలసంధి గుండా ఇకపైనౌకల రాకపోకలకు ఆటంకం ఉండకూడదని ఆకాంక్షిం చింది.