1 March, 2026 | 10:18 PM

మాదిగ అమరవీరుల త్యాగ ఫలితంగానే వర్గీకరణ ఫలాలు

01-03-2026 06:22 PM

మాదిగ అమరులకు ఘన నివాళులు 

గరిడేపల్లి,(విజయక్రాంతి): 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటలో ఎంతో మంది మాదిగ బిడ్డలు అమరులు అయ్యారని, అమరులు త్యాగాల ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ పలాలు అని జై భీమ్ కమిటీ ప్రధాన కార్యదర్శి నకిరేకంటి రవి మాదిగ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కొత్తపల్లి రవి మాదిగ ఆధ్వర్యంలో మాదిగ అమరులకు ఘన నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ... ఎం.ఆర్.పి.ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో సుదీర్ఘ పోరాటం చేసి అసువులు భాషారని వారి ప్రాణ త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న ఫలాలు అని అన్నారు.

విద్య,రాజకీయం వర్గీకరణ ఫలాలు భవిష్యత్ తరాలు కూడా అనుభవిస్తాయని దానికి కారణం మాదిగ అమరులే అని అన్నారు.ప్రతి సంవత్సరం మార్చి ఒకటి నా మాదిగ అమరుల దినోత్సవం జరుపుకోవడం అమరులు ఘన నివాళులు అర్పించడం ప్రతి మాదిగ జాతి బిడ్డ బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్ద పిట్ట పున్నయ్య మాదిగ అమరులకు పూలమాలలు వేసి అమరుల ఆత్మశాంతి కొరకు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి మండల కోఆర్డినేటర్ కుర్రి వెంకన్న మాదిగ, బరిగెల విజయ్ కుమార్, రామకృష్ణ, పిట్ట వెంకటేష్, మచ్చ వేణు, మచ్చ సురేష్, బొజ్జ వెంకటేష్, నందిపాటి రవి,పిట్ట నాగరాజు, కొత్తపల్లి పవన్, పిట్ట గోపి, రేవంత్, పలువురు పాల్గొన్నారు