యువత క్రీడాల్లో రాణించాలి
01-03-2026 06:26 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని హేటిగూడ గ్రామంలో ఉప సర్పంచ్ రాచకొండ ఆదర్శ్ యువతకు వాలీబాల్ కిట్ అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండ విఠల్ ఆదేశానుసారం మండలంలోని ఏటి గూడ గ్రామంలో వార్డు సభ్యులు సడమేక రాకేష్ తో కలిసి వాలిబాల్ కిట్ అందించినట్లు పేర్కొన్నారు.
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడాలపై మక్కువ చూపెట్టాలన్నారు. క్రీడలు మానసిక శారీరక మనోధైర్యాన్ని పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదగడానికి క్రీడలను వేదికగా చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు శ్రీకాంత్, జలపతి సందీప్, రాకేష్ మహేష్, సాయి, స్వామి, ఉమేష్, తదితరులు ఉన్నారు.




