10 March, 2026 | 7:12 PM

Breaking News

మెడికవర్‌లో అడ్వాన్స్‌డ్ ఎండోస్కోపితో చికిత్స

10-03-2026 01:24 AM

ఆహార వాహిక, కడుపు సమస్యలకు శస్త్ర చికిత్స అవసరం లేకుండానే నివారణ

అడ్వానస్డ్ ఎండోస్కోపీతో శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆహార వాహిక, కడుపు సమస్యలకు చికిత్స మెడికవర్ హాస్పిటల్స్

హైదరాబాద్, 9 మార్చి(విజయక్రాంతి): ఆధునిక వైద్య సాంకేతికతను ఉపయోగించి శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆహార వా హిక, కడుపు సంబంధిత క్లిష్టమైన సమస్యలకు విజయవంతంగా చికిత్స అందిస్తూ మె డికవర్ హాస్పిటల్స్ మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది.అత్యాధునిక థర్డ్-స్పేస్ ఎండోస్కోపీ విధానాల ద్వారా రోగులకు ఎటువంటి పెద్ద కోతలు లేకుండా చికిత్స అందించడం ద్వారా జీర్ణకోశ వ్యాధుల చికిత్సలో కొత్త మార్గాన్ని చూపుతోంది.

ఈ అధునాతన చికిత్సలను ప్రముఖ కన్సల్టెంట్ గ్యా స్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ అడ్వానస్డ్ ఎండోస్కోపిస్ట్ డాక్టర్ అరుణ్ అరోరా పగడపల్లి నేతృత్వంలో వైద్య బృందం విజయవంతంగా నిర్వహించింది. ఆధునిక సాంకేతికత తో తక్కువ నొప్పి, తక్కువ ప్రమాదంతో రో గులకు త్వరితగతిన ఉపశమనం కలిగించే విధంగా ఈ చికిత్సలు అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ విధానాల్లో ముఖ్యంగా పెరోరల్ ఎండోస్కోపిక్ మయోటమి(పీఓఈ ఎం) ద్వారా అచలేసియా కార్డియా అనే అ రుదైన వ్యాధితో బాధపడుతున్న రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యాధి వల్ల ఆహా ర వాహికలో కదలికలు సరిగా లేకపోవడం వల్ల ఆహారం కడుపులోకి వెళ్లడం కష్టమవుతుంది. గతంలో దీనికి శస్త్రచికిత్స అవసరమ య్యేది. అయితే ఇప్పుడు నోటి ద్వారా ఎండోస్కోపీ పద్ధతిలో ఎటువంటి కోతలు లే కుండా చికిత్స చేయవచ్చు.

అదేవిధంగా ఈఎస్‌డీ (ఎండోస్కోపీక్ సబ్‌మ్యుకోసల్ డిసెక్షన్ )విధానం ద్వారా కడుపు, చిన్నపేగు మరి యు పెద్దపేగుల్లో ప్రారంభ దశలో ఉన్న కణితులను అత్యంత కచ్చితత్వంతో తొలగిస్తు న్నారు. ఈ పద్ధతి ద్వారా సంబంధిత అవయవాన్ని కాపాడుతూ క్యాన్సర్ కణజాలాన్ని పూర్తిగా తొలగించడం సాధ్యమవుతోంది.ఈ సందర్భంగా డా. అరుణ్ అరోరా పగడపల్లి మాట్లాడుతూ, థర్డ్-స్పేస్ ఎండోస్కోపీ జీర్ణకోశ వ్యాధుల చికిత్సలో విప్లవాత్మక మార్పు లు తీసుకొచ్చింది. పీఓఈఎం, ఈఎస్‌డీ వంటి ఆధునిక విధానాల ద్వారా ఎటువంటి బాహ్య గాయాలు లేకుండా సహజ మార్గాల ద్వారా చికిత్స చేయవచ్చు.

దీనివల్ల రోగులకు తక్కువ నొప్పి ఉండటంతో పాటు త్వర గా కోలుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఆసుపత్రిలో ఉండే రోజులు కూడా తగ్గుతాయి, అని తెలిపారు.మెడికవర్ హాస్పిటల్స్ ప్రతినిధులు మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయి వైద్య సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు. జీర్ణకోశ సమస్యలు లేదా కడుపు సంబంధిత వ్యాధులు ప్రారంభ దశలోనే గుర్తించి సరైన సమయంలో చికిత్స తీసుకుం టే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని వైద్యులు సూచించారు.