31 May, 2026 | 12:57 AM

91 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ

31-05-2026 12:00 AM
  1. ఉత్తర్వులు జారీ చేసిన పురపాలకశాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి
  2. కొత్తవారికి కూడ పోస్టింగ్‌లు

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 91 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. శనివారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ మున్సిపల్ పరిపాలన కమిషనర్, డైరెక్టర్ కార్యాల యం, పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి జారీ చేసింది. పలువురు డిప్యూటీ కమిషనర్లకు పదోన్నతి కల్పించారు. విస్తృత పరిపాలనాపరమైన పునర్ వ్యవస్థీకరణల నేపథ్యంలో ఈ బదిలీలు చోటు చేసుకున్నాయి.

రాష్ట్రంలోని ఆయా మున్సిపాలిటీలతోపాటు జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలోని కమిషనర్లు, గ్రూప్-1, 2 ద్వారా వచ్చిన కొత్త మున్సిపల్ కమిషనర్లకు కూడా పోస్టింగ్ ఇచ్చారు. సొంతజిల్లాల్లో పనిచేస్తూ మూడు సంవత్సరాలు, అంతకు ఎక్కువ సమయం గడిచిన వారికి కూడా స్థాన చలనం కల్పించారు. దీంతో పరిపాలనలో స్థానిక ప్రభావాన్ని నివారించి, నిష్పక్షపాలన అందించవచ్చని ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకుంటుంది.