31 May, 2026 | 12:21 AM

గుండెపొటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

31-05-2026 12:00 AM

ఎల్బీనగర్, మే 30 : హయత్నగర్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వ హిస్తున్న ఈ.సుధాకర్ (55) శుక్రవారం రా త్రి సుమారు 9 గంటల ప్రాంతంలో గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. సూ ర్యాపేట జిల్లా మోతె మండలం బుర్కచర్ల గ్రామానికి చెందిన సుధాకర్  కానిస్టేబుల్ గా 1993 బ్యాచ్ (నల్గొండ)కు చెందినవారు. పోలీసు శాఖలో తన విధులను నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావంతో నిర్వర్తించి సహచరుల అభిమానాన్ని పొందారు.

ప్రస్తుతం ఆయన సూర్యాపేట టౌన్లో తన భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి నివసిస్తున్నా రు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం ఆయన భౌతికకాయాన్ని  స్వగ్రా మం బుర్కచర్ల గ్రామానికి తరలించారు. సుధాకర్ గారి ఆకస్మిక మృతికి పోలీసు శాఖకు, సహచర ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు హయత్నగర్ పోలీస్ స్టేషన్ తరపున సీఐ నాగరాజు గౌడ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ప్రభుత్వ నిబంధనల మేరకు హయత్నగర్ పోలీస్ స్టేషన్ ద్వారా రూ.30 వేల ఆర్థిక సాయం అందజేశారు.