ఫార్మాసిటీ జీవో 31ని రద్దు చేయాలి
31-05-2026 12:00 AM
ధర్నా కమిటీ కన్వీనర్ సరస్వతి
ముషీరాబాద్, మే 30 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం మేనిఫెస్టోలో హా మీ ఇచ్చినట్లుగా ఫార్మాసిటీ జీవో 31ను రద్దు చేయాలని, అక్రమ భూ సేకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చిన భూముల్లో ప్రభుత్వం తక్షణమే పనులు మానుకోవాలని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ సరస్వతి కవుల డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇంద్ర పార్క్ ధర్నా చౌక్ వద్ద శనివారం ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో సామూహిక ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ సరస్వతి కవుల మాట్లాడుతూ గ్రీన్ ఎక్స్ ప్రెస్ హైవే రీజినల్ రింగ్ రోడ్డు పేరుతో టీచర్ సిటీ పేరుతో రైతుల భూములను కొల్లగొట్టడం మానుకోవాలని కోరారు.






