9 March, 2026 | 11:44 PM

గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం

09-03-2026 09:33 PM

ఇంచార్జ్ ఎంపీడీవో ఖాజా అజాజుద్దీన్

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండలంలోని గ్రామ పంచాయతీలకు చెందిన రెండో బ్యాచ్ వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. కార్యక్రమాన్ని మండల అభివృద్ధి అధికారి ఖాజా అజాజుద్దీన్ ప్రారంభించారు. గ్రామ పంచాయతీల పనితీరు మెరుగుపడేలా వార్డు సభ్యులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

గ్రామ పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాల్లో వార్డు సభ్యులు ప్రజలకు దగ్గరగా ఉండి సమ స్యలను గుర్తించి పరిష్కరించే బాధ్యత వహించాలని సూచిం చారు. ప్రభుత్వ పథకాలను గ్రామస్థులకు చేరేలా సమర్థ వంతంగా పనిచేయాలని తెలిపారు.శిక్షణలో గ్రామాభి వృద్ధి, పంచాయతీ పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో  మండలంలోని పలు గ్రామ పంచాయతీల వార్డు సభ్యులు పాల్గొన్నారు.