నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో రెయిన్ జాకెట్స్ పంపిణీ
29-07-2026 09:03 PM
గుండాల, (విజయక్రాంతి): గుండాల గ్రామపంచాయతీ సిబ్బందికి నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో రెయిన్ జాకెట్స్, రెయిన్ క్యాప్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ... వర్షంలో కూడా పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వర్తించడం అభినందించదగిన విషయమని, పారిశుద్ధ్య కార్మికులకు నవ చైతన్య యువజన సంఘం అనేక కార్యక్రమాలలో అండగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో సాగర్, వినయ్, సంతోష్, వినయ్, ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.






