దమ్మాయిగూడ సాయిబాబా మందిరంలో ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవ వేడుకలు
ప్రత్యేక ఆహ్వానితులుగా కర్మాఖ్య దర్శకులు
జవహర్ నగర్,(విజయక్రాంతి): అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించే వారే గురువులని కర్మాఖ్య సినిమా దర్శకులు అదిరే అభి పేర్కొన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ దమ్మాయిగూడ పీఎస్ రావు నగర్ అయ్యప్ప కాలనీలో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో బుధవారం ఘనంగా గురు పౌర్ణమి మహోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ గురు పౌర్ణమి ఆషాడ మాస శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని అంటారని గురువులను పూజించడానికి కేటాయించిన విశిష్టమైన రోజు అని వ్యాస పౌర్ణమి వ్యాస మహర్షి జన్మదినం సందర్భంగా జరిగే పండుగనే గురు పౌర్ణమి అంటారని తెలిపారు.
పంచమ వేదంగా పిలవబడే మహాభారతం తో పాటు 18 పురాణాలను ఉప పురాణాలను లోకానికి అందించిన జగద్గురు ఆయనే కాబట్టి ఆయన జ్ఞాపకార్థం వ్యాస పౌర్ణమిగా పిలుస్తారని తెలిపారు. వ్యాసమహర్షి మానవాళికి ఆది గురువుగా భావిస్తారు అన్నారు. ఆయనతో ప్రారంభమైన గురుపరంపర గురుపౌర్ణమి అన్నారు. అనంతరం బాబా వారికి పంచ విసంతి 75 కలశాలతో అభిషేకము సహస్ర పుష్పార్చన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు దమ్మాయిగూడ వాసులు తదితరులు పాల్గొన్నారు.






