29 July, 2026 | 9:38 PM

Breaking News

మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •   గురుపౌర్ణమి సందర్భంగా సామూహిక ధ్యానం   •   ఆర్మూర్ ఎంఈవోగా రాజేశ్వర్   •   ఏజెన్సీలో భారీ వర్షాలు.. గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్   •   భిక్కనూర్ పీహెచ్‌సీలో వైద్య సేవలపై డైరెక్టర్ ఆకస్మిక తనిఖీ   •   సువర్ణ వనమాల దశదిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •  

పొంగిన రెంకోనె వాగు... రాకపోకలు బంద్

29-07-2026 09:09 PM

మైనార్టీ పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అవస్థలు.

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో రెంకోనే వాగు ఉప్పొంగి తాత్కాలిక వంతెన తెగిపోవడంతో రాకపోకులకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మండల కేంద్రంలో పట్టణ శివారున ప్రవహిస్తున్న రెంకోనే వాగు ఉప్పొంగింది. వాగు అవతల హైటెక్ సిటీ కాలనీ ఉండడం, అక్కడే మైనారిటీ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల ఉండడంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, స్థానికులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దశాబ్దాల నుంచి ఈ సమస్య తీరకుండా ఉండడంతో ప్రతి వర్షాకాలం ఈ తిప్పలు తప్పడం లేదు. ప్రతి ఏడూ వాగుపై తాత్కాలిక వంతెన నిర్మించడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. కాగా వాగు పై  వంతెన నిర్మించాలని అనేకసార్లు మున్సిపాలిటీకి విన్నవించిన ఈ సమస్య తీరడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి వర్షాలకు ఈ వాగు ఉప్పొంగడంతో పాఠశాల ఉపాధ్యాయులు విధులకు హాజరుకాకుండా అవస్థలు ఎదుర్కొంటున్నారు. కాలనీవాసులు సైతం ఈ సమస్యతో సతమతమవుతున్నారు. ఇకనైనా అధికారులు ,నాయకులు పట్టించుకుని వంతెన నిర్మించి సమస్య తీర్చాలని పలువురు వేడుకుంటున్నారు.