29 July, 2026 | 10:04 PM

Breaking News

గురుపౌర్ణిమ వేడుకల్లో సాయిబాబా ఆశీస్సులు పొందిన మున్సిపల్ చైర్మన్   •   నల్లవాగు ప్రాజెక్టును పరిశీలించిన ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి   •   గురువుల ను సన్మానించిన అమ్ము స్వచ్ఛంద సంస్థ   •   బాధితులకు సత్వర న్యాయం.. సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది   •   బురదలో చిక్కుకున్న ఆర్టిసి బస్సు   •   ఓటు హక్కు అమూల్యం.. దరఖాస్తులో జాప్యం వద్దు   •   భద్రాద్రిలో ఘనంగా పోకల దమ్మక్క సేవ యాత్ర   •   శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి   •   బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్ పంపిణీ   •   విశ్వబ్రాహ్మణ సంఘం గుండి గ్రామ కమిటీ ఏర్పాటు   •  

నెమ్లి సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు

29-07-2026 09:04 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నెమ్లి సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా ఆలయంలో బాబా ను దర్శించుకొని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సక్రమంగా కురవాలని పాడిపంటలు పండాలని ప్రజలు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని బాబాను వేడుకున్నట్లు ఎమ్మెల్యే పోచారం తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి వ్యాపారవేత్త నాగులగామ వెంకన్న,నసురుల్లాబాద్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.