కాటమయ్య రక్షణ కిట్టుపై శిక్షణ
* ప్రతి గీత కార్మికుడికి ప్రాణభద్రతకు కాటమయ్య రక్షణ కిట్టు ఎంతో కీలకం
గరిడేపల్లి,(విజయక్రాంతి): కల్లు గీత కార్మికుల భద్రతే ప్రధాన లక్ష్యంగా కీతవారిగూడెం గ్రామంలో కాటమయ్య రక్షణ కిట్టు వినియోగం, తాటి చెట్టు ఎక్కే విధానంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కల్లు గీత కార్మిక సంఘం గ్రామ అధ్యక్షుడు చెన్నగాని పురుషోత్తం గౌడ్ తెలిపారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ స్టేషన్ హౌస్ అధికారి, హుజూర్‌నగర్ వారి ఆదేశాల మేరకు, జిల్లా బీసీ సంక్షేమ శాఖకు చెందిన గంట వెంకటేశం, బండారి రాంబాబు అధికారుల సూచనలతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా శిక్షకులు మడ్డి అంజిబాబు, అబ్బగాని కాశయ్య,చెన్నగాని సైదులు కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్టును సక్రమంగా వినియోగించే విధానం,తాటి చెట్టు ఎక్కేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,రక్షణ పరికరాలను ఉపయోగించే పద్ధతులను వివరించారు. అనంతరం కార్మికులకు తాడు ఎక్కే విధానాన్ని ప్రాయోగికంగా ప్రదర్శించారు. కల్లు గీత కార్మికులు విధుల్లో తప్పనిసరి గా రక్షణ కిట్టును ఉపయోగించి ప్రమాదా లను నివారించుకోవాలని ఈ సందర్భం గా సూచించారు.ప్రతి కార్మికుడి ప్రాణ భద్రతకు కాటమయ్య రక్షణ కిట్టు ఎంతో కీలకమని పేర్కొన్నారు.






