12 August, 2026 | 10:52 PM

క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పాడతాయి

12-08-2026 09:06 PM

మెట్ పల్లి ఇంచార్జి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

మెట్ పల్లి,(విజయక్రాంతి): క్రీడలు మానసికొల్లాసానికి తోడ్పాడతాయని మెట్ పల్లి ఇంచార్జి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్ని బుధవారం ఆయన జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ మాధవితో కలసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతోగానో ఉపయోగపడతాయాని అన్నారు. పోటిల్లో మాత్రమే కాకుండా క్రీడలని రోజువారీ కార్యక్రమాల్లో కూడా భాగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్ల రాజేందర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెర్లపల్లి ఆనంద్ గౌడ్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి. ప్రణయ్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ అబ్దుల్ హఫీజ్, క్రీడా కార్యదర్శి నీరటి రమణ న్యాయవాదులు వడ్డేపల్లి శ్రీనివాస్, కంతి మోహన్ రెడ్డి, పుప్పాల రాంభూపాల్, పోలకొండ దయాకర్ వర్మ, గడ్డం శంకర్ రెడ్డి, బోడ లక్ష్మణ్, ఒజ్జెల శ్రీనివాస్, అలుముల రాంబాబు,తెడ్డు ఆనంద్,చింతకుంట శంకర్ లు పాల్గొన్నారు.