గ్యాసిపికేషన్ పైలెట్ బోర్ హోల్ స్థల పరిశీలన
బెల్లంపల్లి,(విజయ క్రాంతి): మందమర్రి ఏరియా బెల్లంపల్లి లో చేపడుతున్న అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ (UCG) అన్వేషణ కార్యక్రమంలో భాగంగా బుద గెస్ట్ హౌస్ సమీపంలో ప్రతిపాదించిన పైలట్ బోర్‌హోల్ స్థలాన్ని బుధవారం అధికారులు పరిశీలించారు. మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ఆదేశాల మేరకు డ్రిల్లింగ్ పనులు ప్రారంభించేందుకు వీలుగా స్థల అనుకూలత, క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసేందుకు ఈ పరిశీలన జరిపారు.
ఈ పరిశీలించిన వారిలో సంతోష్ కుమార్ ఏజెంట్ (AGM), ఎం. రమేష్ బాబు డిప్యూటీ జనరల్ మేనేజర్ (జియాలజీ), ఎ. ఎస్. ఓ. దేశాయ్ – డిప్యూటీ జనరల్ మేనేజర్, శివ శంకర్,(డిప్యూటీ SE డ్రిల్లింగ్) ఉన్నారు. పనులను సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లపై అధికారులు ఈ సందర్భంగా చర్చించి, తగిన ప్రాథమిక పరిశీలన పూర్తి చేశారు.






