జలసిరి పనుల పురోగతిని పరిశీలించిన అదనపు కలెక్టర్
కోరుట్ల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో వీబీజీ రామ్‌జీ పథకం కింద చేపట్టిన జలసిరి పనుల పురోగతిని అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) బి. రాజగౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న జలసిరి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల ప్రస్తుత స్థితిగతులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులను నాణ్యతా ప్రమాణాలతో, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల అభివృద్ధి, భూగర్భ జలాల పెంపు, రైతులకు ప్రయోజనం చేకూరేలా జల సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నిర్దేశిత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పరిశీలనలో డీఆర్‌డీఓ రఘువరన్, ఎంపీడీవో రామకృష్ణ సంబంధిత, అధికారులు పాల్గొన్నారు.






