సబజిస్టార్ ఎదుట మద్యం మత్తులో వీరంగం
రెండు కుంటల భూమి ఇస్తే ఓకే లేకపోతె అంతు చూస్తానని బెదిరింపులు
చండ్రుగొండ,(విజయక్రాంతి): ఏజెన్సీ చట్టాలను అడ్డుపెట్టుకొని మండలంలో అధికారులను బెదించటం పరిపాటిగ మారిందనే విమర్సలున్నాయి. ఇటీవల సమాచారం చట్టం ప్రకారం రెవెన్యూ భూముల వివరాలను తెలుసుకున్న ఓ సామాజిక వర్గం నాయకుడు చండ్రుగొండ సబ్ రిజిస్టర్లు ను గత కొంతకాలంగా అనధికారికంగా తనకు రెండు కుంటల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తూన్నాడని తెలుస్తోంది. రెవెన్యూ అధికారుల నుండి ఎలాంటి హమి రాకపోవడంతో మద్యం సేవించిన సదరు ఆ నాయకుడు ఈనెల 11 న సబ్జస్టార్ కార్యాలయంలోకి చొరబడి సబజిస్టార్్ను నేరుగా బెదిరించాడనే ఆరోపణలు వస్తున్నాయి.
గంటన్నర పాటు రెవెన్యూ కార్యాలయంలో దర్జాగా కూర్చొని బెదిస్తుండటంతో విసుగు చెందిన సబ్ రిజిస్టార్ చండ్రుగొండ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వటం, అక్కడకు పోలీసులు వచ్చిన ఎటువంటి చర్యలు తీసుకోకపోగా నిమ్మకునీరెత్తన్నట్లు
వ్యవరించి, రాచమర్యాదలతో పోలీసులు సదరు ఆ వ్యక్తి ని అక్కడ నుండి పంపించడం గమనార్హం. తనను బెదిరించి, కార్యాలయ విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిని కనీసం పోలీసులు అదుపులోకి తీసుకొలేదని సబరిజిస్టార్ ఉన్నతాధికారులకు, తోటి తహసీల్దార్ల వద్ద వాపాయిన్నట్లు విశ్వసనీయ సమాచారం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి దౌర్జన్యంగా ప్రవేశించటమే కాకుండా మద్యం మత్తులో విధులకు ఆటంకం కలిగించిన అతనిపై పోలీసు, రెవెన్యూశాఖలు చర్యలు తీసుకోకపోవడం పట్ల మండల ప్రజలు విస్మయం చెందుతున్నారు.






