30 July, 2026 | 2:49 AM

మావోయిస్టు పార్టీకి చావుదెబ్బ

30-07-2026 12:00 AM

మావోయిస్ట్ అగ్రనేత బిస్రా సహా మరో ఇద్దరి అరెస్ట్

బిస్రా తలపై కోటి రూపాయల రివార్డు

40మందిలో చివరి అగ్రనేతే మిసిర్ బిస్రా

రాంచీ, జూలై 29: జార్ఖండ్‌లోని మావోయిస్టు అగ్రనేత, పొలిటిబ్యూరోలో మిగిలిన ఏకైక నేత, మోస్ట్ వాంటెడ్‌లో ఒకరైన మిసిర్ బెస్రా (సాగర్ అలియాస్ సునిర్మల్)ను సీఆర్పీఎఫ్ భద్రతా దళాలు, పోలీసులు అరెస్టు చేసినట్లు బుధవారం ప్రకటించారు.

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ె జిల్లాల సరిహద్దులోని తుండి అడవుల్లో సీఆర్‌పీఎఫ్, జార్ఖండ్ పోలీసలు కలిసి నిర్వహించిన ఆపరేషన్‌లో బెస్రా చిక్కినట్లు తెలిపారు. పలు రాష్ట్రాల్లో మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించిన పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న, గిరిడిహ్లోని హర్లాడిహ్ నివాసి అయిన బెస్రాను, ధన్‌బాద్ సరిహద్దులోని తుండిమండియా అటవీ ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టు సభ్యులు -మోచ్చు, సౌరభ్ (అలియాస్ గౌరవ్), ఇద్దరు గ్రామస్తులతోపాటు అరెస్టు చేశారు. బెస్రా తలపై కోటి రూపాయల రివార్డు ఉంది. బెస్రా అరెస్టు మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా అభివర్ణిస్తున్నారు.

మావోయిస్టు అత్యున్నత కేంద్ర, పొలిట్‌బ్యూరోలో మిగిలి ఉన్న ఏకైక అగ్రనేత బెస్రా. 20ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న బెస్రా ఎట్టకేలకు పట్టుబడటంతో మావోయిస్టు కేంద్ర కమిటీలో ఇక క్రియాశీల నాయకులు ఎవరూ లేనట్లయ్యింది. 40 మందికి పైగా ఉన్న కేంద్ర కమిటీలోని సభ్యులంతా ఒక్కరొక్కరుగా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడం లేదా లొంగిపోయారు. బెస్రా అరెస్ట్‌తో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించిన వెస్ట్ సింగ్‌భూమ్ జిల్లా సారండ ప్రకటనపై నక్సల్స్ లేని ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. భద్రతా సంస్థల ప్రకారం జార్ఖండ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్‌గడ్‌లోని మావోయిస్టు కార్యకలాపాల కు బెస్రా చాలా కాలంగా కీలక సూత్రధారి.