దేశ విద్యా వ్యవస్థను నడిపేది ఆర్ఎస్ఎస్
న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖను ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) కాదు, ఆర్‌ఎస్‌ఎస్ నడుపుతోందని ప్రతిపక్ష నేత, రాహుల్ గాంధీ(Rahul Gandhi) లోక్ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర విద్యాశాఖలోని ఒక ఓఎస్డీ శాఖను నిర్వహిస్తున్నారు. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వారేనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా(Union Minister Dharmendra Pradhan resigns) చేసిన ఉపయోగం లేదన్న రాహుల్ గాంధీ ఆయనకేవలం నామ మాత్రమే అన్నారు. విద్యార్థులు స్వతంత్రంగా ఆలోచించే విద్యార్థులుగా కాకుండా, అంధభక్తులుగా మారాలని ఆర్‌ఎస్‌ఎస్ కోరుకుంటోందని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజీ అనంతరం దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలకు రాహుల్ గాంధీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.విధ్యార్థలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని రాహుల్ మండిపడ్డారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం పై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.






