1 April, 2026 | 2:34 AM

టీఎన్జీవోస్ సంఘం ప్రమాణ స్వీకారం

01-04-2026 01:05 AM
  1. ఎలాంటి త్యాగాలాకైనా సిద్ధం 

రాష్ట్ర అధ్యక్షుడు మారం, ప్రధాన కార్యదర్శి ముజీబ్ 

హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాం తి) : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కా రం కోసం ఏ త్యాగనికైనా సిద్ధమని టీఎన్జీవోస్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం ముజీబ్ హుస్సేనీ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ నాంప ల్లిలోని టీఎన్జీవో భవన్‌లో టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడుగా జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సంగతి విధితమే. ఈ సందర్బంగా వారు భాద్యతలు స్వీకరించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ టీఎన్జీవో సంఘం సం క్షేమం, సమస్యల పరిష్కారించే ఎజెండాతో నిర్మాణమైందని అదే లక్ష్యంతో ఎనిమిది  దశబ్దాలుగా నిరంతరం పాటుపడుతోందని చెప్పారు. పదవీ భాద్యతలు స్వీకరించిన జెఏ సి చైర్మన్, టిఎన్జీస్ కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ ఎం ముజీబ్ హుస్సేనీ, అసోసియేట్ అధ్యక్షులు ముత్యాల సత్యనారాయణ గౌడ్, కోశా ధికారి ఉమాదేవిలను ఖమ్మం జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి కొణిదెన శ్రీనివాస్ ఘనంగా సన్మానించా రు.

కార్యక్రమంలో కేంద్ర సంఘం కార్యదర్శి జడ్ ఎస్ జయపాల్, టిఎన్జీవోస్ జిల్లా అసోసియొట్ అధ్యక్షులు కొమరగిరి దుర్గాప్ర సాద్, నాయకులు బిట్టా ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి కేంద్ర సంఘంలోకి తీసుకున్న జడ్ ఎస్ జయపాల్‌కు రాష్ట్ర సంఘం ప్రచార కార్యదర్శి పదవిని కేటాయించారు. ఈ సంద ర్బంగా అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధా న కార్యదర్శి ఎస్ ఎం ముజీబ్ హుస్సేనీ లు జయపాల్ ను ఘనంగా సన్మానించారు.

టిఎన్జీవోస్ కేంద్ర సంఘం కార్యాలయంలో టీఎన్జీవోస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కుమార్, కార్యదర్శి కురాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులను సన్మానించారు. కార్యక్రమం లో అసోసియేట్ అధ్యక్షులు కె.ఆర్ రాజ్ కుమార్, కోశాధికారి బాలరాజు, ఖలీద్ అ హ్మద్, శంకర్, గీతా, వైదిక్శాస్త్ర, ముకీంఖురేషి, శ్రీధర్ పాల్గొన్నారు. టీఎన్జీవోస్ ఈఎన్టీ యూనిట్ అధ్యక్షులు తూముకుంట రాజు పూలమాల శాలువాతో సన్మానించారు.