ఫ్రాన్స్ చేతిలో సెనెగెల్ చిత్తు
18-06-2026 02:16 AM
ఎంబాపె రికార్డుల మోత
న్యూజెర్సీ, జూన్ 17 : ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో సెనెగెల్‌ను 3 గోల్స్ తేడా తో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ ఎంబాపె రికార్డుల మోత మోగించాడు. తొలి అర్థభాగంలో సెనెగెల్ గట్టిపోటీనిచ్చింది. అయితే సెకండాఫ్‌లో ఫ్రాన్స్ ఆధిపత్యం కనబరిచింది.
ఎంబాపె 66 వ నిమిషంలో అద్భుతమైన గోల్‌తో జట్టుకు 1 ఆధిక్యాన్ని అందించాడు. కాసేపటికే బ్రాడ్లీ బార్కోలా మరో గోల్ సాధించాడు. దీంతో ఫ్రాన్స్ ఆధిక్యం 2- చేరింది. ఇంజూరీ టైమ్‌లో సెనెగల్ గోల్ సాధించడంతో ఉత్కం ఠ పెరిగింది. కాసేపటికే ఎంబాపె మరో గోల్ చేయడంతో ఫ్రాన్స్ విజయాన్ని అందుకుంది.






