1 April, 2026 | 2:35 AM

లేక్ వ్యూ పార్కులో ఫూలే దంపతుల విగ్రహాలు

01-04-2026 01:04 AM

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు 

హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాం తి) : ఈ నెల 11న పీవీఎన్‌ఆర్ మార్గ్‌లోని లేక్ వ్యూ పార్కులో ఏర్పాటు చేస్తున్న మహా త్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాల మహా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. మంగళవారం ఏర్పాట్లను మంత్రులు, ప్రజాప్రతినిధులు, బీసీ నాయకులు పరిశీలించారు. మంత్రులు పొ న్నం ప్రభాకర్, కొండా సురేఖ, చీఫ్ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్, గోపాల్, బీర్ల ఐలయ్య, కాలేరు వెంకటేష్, తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ జి. నిరంజన్, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరగనున్న అధికారిక ఆవిష్కరణకు ముందు ఈ పరిశీలన తుది సమీక్షగా నిర్వహించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఫూలే దంపతుల మహత్తర సేవలను స్మరించుకున్నారు. ఈ ప్రాజెక్టును హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అమలు చేస్తోంది.

ఫూలే దంపతుల జ్ఞాపకార్థంగా ప్రజలకు అవగాహన కలిగించేలా ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం 2,105 చదరపు మీటర్లు (సుమారు 2,517 చదరపు గజాలు)లో రెండు విగ్రహాలు 16 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయబడుతున్నాయి.

కా ర్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్నన్, ఐఏఎస్, బీసీ సంక్షేమ కమిషనర్ బాల మా యాదేవి, తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి బి. సైదులు, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ వి.ఎస్. ఎన్.వి. ప్రసాద్, చీఫ్ ఇంజనీర్ బి. రవీందర్, సూపరింటెండింగ్ ఇంజనీర్ అప్పారావు, జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ టి వెంకన్న పాల్గొన్నారు.