13 March, 2026 | 10:21 PM

ముగ్గురికి ఐదు రోజుల జైలు శిక్ష

13-03-2026 06:56 PM

- 26 మందికి రూ.2,54,000 జరిమానా

సిద్దిపేట క్రైం: సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులు కొన్ని రోజుల క్రితం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 26 మంది పట్టుబడ్డారని ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. వారిని శుక్రవారం సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరిచినట్టు చెప్పారు.

విచారణ అనంతరం జడ్జి 26 మందికి కలిపి  రూ.2లక్షల 54వేలు జరిమానా, వారిలో ముగ్గురికి అయిదు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారని సీఐ ప్రవీణ్ పేర్కొన్నారు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఇద్దరికి కలిపి రూ.10వేలు జరిమానా విధించారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిరోజూ డ్రంక్ అండ్  డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తామని చెప్పారు.