13 March, 2026 | 9:17 PM

బెజ్జూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పంద్రం పుష్పలత

13-03-2026 06:58 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బెజ్జూర్ మండల తాజా మాజీ జెడ్పీటీసీ సభ్యులు పంద్రం పుష్పలత ని నియమించారు.కొమరం భీం జిల్లా డీసీసీ అధ్యక్షులు ఆత్రం సుగుణక్క ఆదేశాలమేరకు  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ప్రకటించారు.

బెజ్జూర్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గా నియమతులైన సందర్భంగా ఆమెను సాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ గణపతి, సర్పంచులు సోయం చిన్నయ్య, శ్రీహరి, అర్షాద్ హుస్సేన్ మాజీ సర్పంచ్ లింగయ్య, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.