20 May, 2026 | 1:20 AM

ఉద్యమకారులకు గౌరవం దక్కేనా..?

20-05-2026 12:11 AM
  1. నూతన కమిటీతో చిగురిస్తున్న ఆశలు 
  2. ఉమ్మడి జిల్లాలో 500కు పైగా ఉద్యమకారులు 

నిర్మల్, మే 19 (విజయక్రాంతి) : తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు నూతన కమిటీతోనైనా గౌరవం దక్కేనా అని ఆశతో ఎదు రుచూస్తున్నారు. 1969 ,72 ఉద్యమాలతో పాటు మలిదశ 2001 నుండి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమం పాల్గొన్న ఉద్యమకారులకు తెలంగాణ ప్రభుత్వంలో గౌర వం ఇస్తామని చెప్పిన అది కొందరికి వర్తించింది.

కెసిఆర్ నాయకత్వం మరిదశ ఉద్య మం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉద్యోగులు కుల సంఘాల నేతలు ఉద్యోగ సంఘాల నాయకులు విద్యార్థి సంఘాల నేతలు ఉద్యమకారులు జేఏసీ నేతలు తెలంగాణ కోసం పోరాటం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ జేఏసీ ఏ పిలుపు ఇచ్చిన ఆ పిలుపులు భాగస్వామ్యమై తెలంగాణ ఆకాంక్ష కోసం ఎన్నో ధర్నాలు దీక్షలు మానవారాలు రోడ్ల దిగ్బంధం.

ఆంధ్ర ఉద్యోగుల గో బ్యాక్ వంటి ఉద్యమాలతో ఉమ్మడి జిల్లా లో ఎందరో ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ కొమురం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో జేఏసీలుగా ఏర్పడి సబ్బన్న వర్గాలు తెలంగాణ ఉద్యమం లో పాల్గొని కొందరు ప్రాణాలు తీసుకోగా మరికొందరు జైళ్ళ పాలయ్యారు.. అనేకమంది పై కేసులు నమోదయ్యాయి. 

కొందరికి లాభం..

తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అమరులైన కుటుంబాలకు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం కొలువులు ఇచ్చినప్పటికీ అవి కొందరికి దక్కాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1969 72 ఉద్యమాలతో పాటు 2001 నుంచి జరిగిన ఉద్యమంలో ఎందరో మంది ప్రాణాల ను సైతం లెక్కచేయకుండా ఉద్యోగంలో ఉన్న జేఏసీలుగా ఏర్పడి తెలంగాణ కోసం కొట్లాడిన్రు. తెలంగాణ వస్తే తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు ఇచ్చి పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని అక్రమ కేసులు ఎత్తివేస్తామని గుర్తింపు కార్డులు ఇండ్ల స్థలా లు ఇస్తామని అప్పటి కెసిఆర్ ప్రభుత్వం ప్రకటించిన కొందరికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి.

ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అనేక కేసుల్లో జైలు పాలై వర వారి కుటుంబ సభ్యులను ఉద్యమంలో కోల్పోయిన కుటుంబాలు నేటి కూడా 300 పైగానే ఉంటాయని అంటున్నారు. వారందరికీ ప్రభుత్వం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫె స్టోలో తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం అధికారులకు వచ్చి రెండున్నర ఏళ్ళు గడిచింది. ఇప్పటికి ఉద్యమ కారులకు తగిన గౌరవం దక్కడం లేదని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీగా ఏర్పడి వారి డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది. 

కమిటీతో గౌరవం దక్కేనా.. 

ప్రజా పాల ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం కల్పించేందుకు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుల కమిటీని ప్రకటించింది. మాజీ ఎంపీ ప్రభుత్వ సలహాదారు సీనియర్ నేత కేశవరావు నాయకత్వంలో సీనియర్ ఉద్యమకారులతో కలిసి ఈ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు మొత్తం ఎనిమిది మంది సభ్యులు నియమించింది. ఈ కమిటీ తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 1969, 72, 2001, నుండి 2014 వరకు జరిగిన తెలంగాణ వివిధ దశల ఉద్యమంలో పాల్గొని ప్రభుత్వ ప్రయోజనం పొందని కుటుంబాలను గుర్తించనుంది.

ముందుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని చనిపోయిన వారికి మొదటి ప్రాధాన్యత, గాయపడిన వారికి రెండో ప్రాధాన్యత, జైల్ల పాలైన వారికి మూడో ప్రయారిటీ, ఉద్యమంలో పాల్గొన్న మిగతా వారికి నాలుగో ప్రయారిటీ కింద గుర్తింపు కార్డులను ఇచ్చేందుకు చర్యలు తీసుకొని ఉన్నారు. ఈ కమిటీకి తెలంగాణ ఉద్యమంలో వారు పాల్గొన్న ఉద్యమ చిత్రాలు ఫోటో క్లిప్పింగ్లు కేసు వివరాలు, చనిపోయిన వారు ఉంటే కుటుంబ స్థితిగతులు.

తెలంగాణ ఉద్యమ కోసం వివిధ సామాజిక ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని గుర్తించాలని నిర్ణయించింది. అమరవీరుల జ్యోతి పథకం కింద వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం కమిటీ సిఫార్సుల మేరకు భవిష్యత్తులో వీరి ప్రయోజనాలకు చర్యలు తీసుకుని అవకాశముంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో సుమారు 500 మంది ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమ ంలో పాల్గొన్న వారికి ప్రభుత్వం గౌరవం ఇచ్చి గుర్తింపు కార్డులను అందించి ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది. 

డిమాండ్లు ఇవీ.. 

ఇప్పటివరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులకు ప్రభుత్వం తగిన గౌరవించి బండి రంగాల్లో ప్రోత్సహించాలని తెలంగాణ ఉద్యమకారుల చేసి నేతలు వెల్లడిస్తున్నారు. ఇందులో ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యమకారుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యమకారులకు పెన్షన్లు ఉచిత భాస్ సౌకర్యం ఇందిరమ్మ ఇల్లు. ఉద్యమంలో పెట్టిన కేసుల ఎత్తివేత, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు, హెల్త్ కార్డులు, గుర్తింపు కార్డు, ఇంటి స్థలం వంటివి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

డిమాండ్లను కమిటీ పరిశీలించాలి.. 

నీళ్లు నిధులు నియామకాలు లక్షంగా తెలంగాణ ఉద్యమం నడిచింది. ఉద్యమంలో ఉద్యోగులు కవులు కళాకారులు మేధావులు విద్యార్థులు కుల సంఘాల నేతలు అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ కోసం కొట్లాడి కొందరు ప్రాణాలు కోల్పోతే కొందరు దిక్కుతోని స్థితిలో ఉన్నారు. వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు కమిటీని ఏర్పాటు చేయడం హర్షనీయం. కమిటీ అన్ని జిల్లాలో నిజమైన ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వ ప్రయోజనాలు పొందేలా చర్యలు తీసుకోవాలి. 

 కొట్టి శేఖర్, ఉమ్మడి జిల్లా జెఏసీ ఉద్యమకారుడు 

ఉద్యమకారులకు గౌరవం దక్కాలి.. 

తెలంగాణ తుదిదశ ఉద్యమంలో విద్యా ర్థి జెఎసి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నేతగా అనేక పోరాటాలు ఆందోళనలు పాల్గొన్నా.  తెలంగాణ ఉద్యమ జేఏసీ పిలుపుతో రోడ్ల పై వచ్చి పోలీసుల దెబ్బలకు భయపడకుండా ఆందోళన నిర్వహించాం.. అప్పటి ప్రభుత్వం మాపై ఎన్నో కేసులు పెట్టింది. తెలంగాణ వస్తే అదే చాలు అనుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కొందరు ఉద్యమకారులకు మాత్రమే గౌరవం దక్కింది. అందరికీ గౌరవం దక్కేలా సీఎం ఏర్పాటు చేసిన కమిటీ చర్యలు తీసుకొని మా డిమాండ్లు పరిష్కరిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది.

 గాజుల రవికుమార్, విద్యార్థి ఉద్యమ నాయకుడు