16న సిపిఐ ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమం
13-03-2026 06:53 PM
- సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్
ముకరంపుర,(విజయక్రాంతి): కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారం వేసేందుకు పెట్రోల్ వంటగ్యాస్ ధరలు పెంచిందని, పెంచిన ధరలు తగ్గించాలని రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 16న సిపిఐ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో జరిగే నిరసన కార్యక్రమాలను ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం ఓ చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. కరీంనగర్ లో జరిగే కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో జరిగే నిరసన కార్యక్రమాలలో ప్రజలు, సిపిఐ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.




