మూడో లైను పనులతో ఆర్వోబీలో ఇబ్బందులు
మహబూబాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): మూడవ రైల్వే లైన్ పనులను సక్రమంగా నిర్వహించకపోవడం వల్లే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్యుబిలో వరద నీరు నిలిచిందని, వెంటనే రైల్వే ఇంజనీరింగ్ అధికారులు స్పందించి ఆర్ యు బిలో వరద నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అధికారులను కోరారు.
ఆర్ యు బి లో వరద నీరు నిలిచి ఆదివారం రాకపోకలు స్తంభించడంతో మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ జ్యోతి, వార్డ్ కౌన్సిలర్ అజయ్ సారధి రెడ్డితో కలిసి ఆర్యుబిని సందర్శించారు. వరద నీరు నిలుస్తుందన్న విషయంపై క్షేత్రస్థాయిలో పరిశీలి ంచి, మూడవ లైన్ నిర్మాణం సందర్భంగా వరద నీరు ముందుకు వెళ్లకుండా అడ్డంకులు కల్పించడం వల్లే వరద నీరు ఆర్యుబీ లో నిలిచిందని నిర్ధారించి, వెంటనే ఈ విషయ ంపై మున్సిపల్, రైల్వే ఇంజనీరింగ్ అధికారు లు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లా కేంద్రంలోని అండర్ బ్రిడ్జి ను ఎ మ్మెల్యే మురళి నాయక్ మున్సిపల్ చైర్ ప ర్సన్ గుగులోత్ జ్యోతి రమేష్ లతో పాటు పరిశీలించిన స్థానిక 33వ వార్డు కౌన్సిలర్ సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి నేడు మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 33 వ వార్డులో గల అం డర్ బ్రిడ్జి లో రాత్రి తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి రాకపోకలు బందు కావ డంతో నిలిచిన నీరు ను ఎమ్మెల్యే మురళి నాయక్ చైర్పర్సన్ గుగులోతు జ్యోతి స్థానిక 33 వ వార్డు కౌన్సిలర్ బి అజయ్ సారధి రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యంగా మూడో రైల్వే లైన్ పనుల వల్ల గతంలో హిస్టారీతిన బ్రిడ్జి నిర్మించడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయ ని భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని ముఖ్యంగా రా బోవు వర్షాకాలం లో కొత్త బజా ర్ పాత బజార్ లకు రాకపోక లు లేకుండా ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా ము న్సిపల్ అధికారులు రైల్వే అధికారులు తగిన చర్యలు తీసుకోవాల ని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాయకులు కుమార్ నవీన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.






