రావుల చెరువు సుందరీకరణకు కృషి
15-06-2026 01:48 AM
- రాత్రి, పగలు శ్రమించి పనులు పూర్తి చేయాలి
- మంథనిలో మంత్రి శ్రీధర్‌బాబు
మంథని, జూన్ 14 (విజయక్రాంతి): మంథని పట్టణంలోని రావుల చెరువు కట్ట సుందరీకరణ పనులను ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదివారం పరిశీలించారు. చెరువులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘మంథని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రావులచెరువు, అయ్యగారి చెరువును అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని, పనులలో ఎటువంటి జాప్యం ఉండకూడదని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తవ్వాలంటే, రాత్రి, పగలు శ్రమించి పనులను వేగవంతం చేయాలి’ అని అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.






