15 June, 2026 | 2:54 AM

దీప్తిశర్మ పాంచ్ పటాకా

15-06-2026 01:44 AM

పాక్‌ను తిప్పేసిన స్పిన్నర్లు

భారత మహిళల ఘనవిజయం

టీ20 ప్రపంచకప్‌లో బోణీ

మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్‌ను భారత్ ఘనవిజయంతో ఆరంభించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన భారత్ కు పాక్ పోటీఇవ్వలేకపోయింది. బ్యాటింగ్‌లో స్మతి మంధాన, రిఛా ఘోష్ మెరిస్తే... బౌలింగ్‌లో దీప్తి శర్మ(5/10), శ్రీచరణి(3/21) తిప్పేశారు. దీంతో మరోసారి పాక్‌పై తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్న భారత మహిళల జట్టు వరల్డ్‌కప్‌లో శుభారంభం చేసింది. 

బర్మింగ్‌హామ్, జూన్ 14: ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ సమయంలో మరోసారి నో షేక్ హ్యాం డ్ విధానానికే భారత్ కట్టుబడింది. పాక్ కెప్టెన్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వకపోగా.. మ్యాచ్ అనం తరం రెండు జట్లు కరచాలనం చేసుకోలేదు. కాగా మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. షెఫాలీ వర్మ (6), జెమీమా (1) నిరాశ పరిచారు.దీంతో 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, స్టార్ బ్యా టర్ స్మృతి మంధాన జట్టును ఆదుకున్నా రు. వీరిద్దరూ తమ అనుభవంతో అద్భుతమైన పార్టనర్ షిప్ నెలకొల్పారు. మూడో వికెట్‌కు 91 పరుగులు జోడించారు. ఈ క్రమంలో పాక్ బౌలర్లను ఆటాడుకున్న స్మృ తి కేవలం 44 బంతుల్లోనే 68 (9 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేయగా.. హర్మన్ ప్రీత్ 36 పరుగులకు ఔటైంది. కాగా హర్మన్‌ప్రీత్ అరుదైన రికార్డు సృష్టించింది. టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన మహిళా బ్యాటర్‌గా నిలిచింది. గతంలో ఈ రికార్డు మిథాలీరాజ్ పేరిట ఉండేది. మిథాలీ 726 రన్స్ చేయగా ఇప్పుడు హర్మన్ ఆ రికార్డును బ్రేక్ చేసింది.

ఆమె తర్వాతి స్థానంలో స్మృతి మంధానా నిలిచింది. ఇక ఇన్నింగ్స్ చివర్లో రిఛా ఘోష్ విధ్వంసం సృష్టించింది. ఒకదశలో 150 రన్స్ అ యినా చేస్తుందనుకున్న భారత్ స్కోరును రిఛా  170/6కు చేర్చింది. రిఛా ఘోష్ కేవ లం 17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 34 పరుగులు చేసి వెనుదిరిగింది. పాక్ బౌలర్లలో సదియా 2, ఫాతిమా సనా 2 వికెట్లు తీశారు. తర్వాత 171 పరుగుల లక్ష్యఛేదనలో పాకిస్థాన్ దూకుడుగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేసింది. ఓపెనర్ ఫిరోజా వికెట్ చేజార్చుకున్నా ధాటిగా 52 పరుగులతో పటిష్టంగా కనిపించింది.

అయితే పవర్ ప్లే తర్వాత భారత బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. ఒకవైపు దీప్తి శర్మ, మరోవైపు తెలుగమ్మాయి శ్రీచరణి చెలరేగిపో వడంతో పాక్ బ్యా టర్లు పెవిలియ న్ కు క్యూ కట్టారు. శ్రీచరణి 21 పరుగులకు 3 వికెట్లు తీయగా... ఆరం భంలో కీలక వికెట్లు తీసిన దీప్తి శర్మ చివర్లో టెయిలెండర్ల భరతం పట్టింది. 5 వికెట్లతో పాక్ పత నాన్ని శాసించింది. 4 ఓవర్లలో కేవలం 10 పరుగులే ఇచ్చిన దీప్తి ఐదు వికెట్లు పడగొట్టింది. 

స్కోరు బోర్డు

భారత్ ఇన్నింగ్స్ : 170/6 (స్మృతి మం ధాన 68, హర్మన్‌ప్రీత్ కౌర్ 36, రిఛా ఘోష్ 34; సాదియా 2/41, ఫాతిమా సనా 2/33)

పాకిస్థాన్ ఇన్నింగ్స్ : 106 (మునీ బా 41, అలియా 18, ఫిరోజా 12, ఆయే శా 12; దీప్తి శర్మ 5/10, శ్రీచరణి 3/21)