23 May, 2026 | 6:24 PM

Breaking News

చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •   పేరు మార్పిడి చేసిన రెవెన్యూ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి   •   జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ గా దూమల రాజ్ కుమార్   •   తాడువాయిలో జీలుగ విత్తనాల పంపిణీ   •   రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా గడ్డం రాజశేఖర్ నియామకం   •   నందివాడలో ఉపాధి పనుల పరిశీలన   •   రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం కావాలి   •   కలుషిత నీరే తాగునీరు.. రోగాల బారిన పడుతున్న ప్రజలు   •  

లక్కీ డ్రాల పేరుతో లూటీ చేస్తారు

18-01-2026 02:15 AM
  1. రీల్స్ మాయగాళ్లను నమ్మొద్దు
  2. హైదరాబాద్ సీపీ సజ్జనార్

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 17 (విజయక్రాంతి): రీల్స్ మాయగాళ్లను నమ్మొ ద్దని, లక్కీ డ్రాల పేరుతో లూటీ చేస్తారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా హెచ్చరించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్కీ డ్రాల పేరుతో జనాల జేబులకు చిల్లులు పెడుతున్న ఇన్‌ఫ్లుయెన్సర్లకు కూడా ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాపులారిటీ ఉం ది కదా అని మోసాలకు పాల్పడితే ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని స్పష్టం చేశారు. రూ.99, రూ.199 కడితే చాలు.. ఖరీదైన కార్లు, స్పోర్ట్స్ బైకులు, ప్లాట్లు, ఐఫోన్లు, డీజే సెట్లు బహుమతులుగా ఇస్తామంటూ రీల్స్ లో ఊదరగొడుతున్నారని, ఇదంతా బూటకమని, ప్రజలు నమ్మవద్దని సూచించారు.