23 May, 2026 | 7:13 PM

Breaking News

మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి   •   కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •  

టీఆర్పీలో భారీగా చేరికలు

18-01-2026 02:16 AM

కండువా కప్పి ఆహ్వానించిన పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, జనవరి 17(విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజా పక్షాన పోరాడుతు న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) లోకి చేరికల పరంపర కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మల్లన్న సిద్ధాంతాలకు ఆకర్షితులై యువత, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారు. ఇందులో భాగంగా శనివారం రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్, అబ్దుల్లాపూర్మెట్ మండలాలకు చెందిన పలువురు ముఖ్య నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరారు. రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్ల వాసుదేవ్ ఆధ్వర్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధగాని హరిశంకర్ గౌడ్ నేతృత్వంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.

షాద్ నగర్, అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని హరిశంకర్ గౌడ్ సమన్వయం చేస్తూ, పార్టీ ఆశయాలను వారికి వివరించారు.పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్తగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు, రంగారెడ్డి జిల్లాకు చెందిన వివిధ విభాగాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.