2 May, 2026 | 1:13 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

మహిళలపై రూ.3 వేల కోట్ల వడ్డీల భారం మోపారు

18-03-2026 01:00 AM
  1. ఆడబిడ్డల అభయహస్తం నిధులను కాజేశారు
  2. సోషల్ మీడియాలో దుష్ప్రచారమే బీఆర్‌ఎస్ పని
  3. పదేళ్లు ప్రజలకు ఏం చేశారు?
  4. అసెంబ్లీలో మంత్రి సీతక్క ఆగ్రహం

హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడమే బీఆర్‌ఎస్ పార్టీ పనిగా పెట్టుకుందని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తంచేశారు. పదేండ్లలో బీఆర్‌ఎస్ ఏంచేసిందని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హయాంలో మహిళలపై రూ.3 వేల కోట్ల వడ్డీల భారం మోపారని మండిపడ్డారు. మహిళలకు ఇవ్వాల్సిన రూ.3 వేల కోట్ల వడ్డీలను చెల్లించకుండా మోసంచేశారని, ఆడబిడ్డలు రూపాయి రూపాయి పోగేసి ఆదా చేసుకున్న అభయ హస్తం నిధులను గత ప్రభుత్వం కాజేసిందని ఆరోపించారు.

బీఆర్‌ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని నిలదీశారు. మంగళవారం అసెంబ్లీలో కేటీఆర్‌కు కౌంటర్‌గా మంత్రి సీతక్క మాట్లాడారు. కో టి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని సంకల్పంతో పనిచేస్తున్నామని, ఇప్పటి వరకు మహిళా సంఘాలకు ఈ రెండు సం వత్సరాల్లో రూ.57 వేల కోట్ల రుణాలు ఇప్పించామని వెల్లడించారు. మహిళా రుణాలకు సంబంధించి రూ.1,390 కోట్లు ఇప్పటివరకు మహిళలకు వడ్డీలు చెల్లించామని, మహిళలను కోటీశ్వరులను చేయా లని లక్ష్యంతో పనిచేస్తున్నామని స్పష్టంచేశారు.

ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో బతికే మహిళలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. మీరు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని, పదేండ్లలో చేశారని, డబల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తామని.. కట్టించలేదని గుర్తుచేశారు. మహిళల కు వడ్డీ లేని రుణాలపై నిష్టూరాలు ఎందుకని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంపై మాట్లా డే ముందు మీరు ఇచ్చిన హామీలను ఎం దుకు నెరవేర్చలేకపోయారో సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు.

సమ్మక్క సారలమ్మ జాతరలో మహిళా సంఘాలకు రూ.6 కోట్లతో షాప్స్ పెట్టిస్తే మూడున్నర కోట్లు లాభం పొందారని పేర్కొన్నారు. గతం లో రూ.5 లక్షల రుణాల వరకు వడ్డీలను లిమిట్ చేస్తూ హరీశ్‌రావు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నాకరని, ఇప్పుడు రూ.5 లక్షలకు మించి రుణలకు కూడా వడ్డీలు చెల్లించాలని అడగటం విడ్డూరమని ఎద్దేవాచేశారు. భవిష్యత్తులో రూ.5 లక్షలకు మించి రుణాలకు కూడా వడ్డీలు చెల్లించే అంశాన్ని పరిశీలించాలని సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.