18 March, 2026 | 2:32 AM

ఒక్కో రైతుకు 25 వేల బోనస్

18-03-2026 01:02 AM
  1. సన్న ధాన్యం పండించే రైతుకు క్వింటాకు రూ.500 
  2. మహిళలకు రూ.57 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చాం 
  3. బీఆర్‌ఎస్ నేతలకు ఆడబిడ్డలపై ఏమాత్రం గౌరవం లేదు 
  4. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): రైతు భరోసా కాకుండా ఒక్కో రైతుకు వరి ధాన్యం బోనస్ పేరిట రూ.25,000 అందుతుందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు. రైతుల శ్రమను గుర్తించి సన్నధాన్యం పండించినవారికి క్వింటాకు రూ.500 చొప్పున బోన స్ ఖాతాలో వేస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో రూ.9,000 కోట్లు వారి ఖాతాలో జమచేశామన్నారు.

వడ్డీ లేని రుణాల కింద స్వయం సహాయక సంఘా ల మహిళలకు ఏటా రూ.20 వేల కోట్లకుపైగా వారి ఖాతాల్లో జమచేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు వడ్డీలేని రుణాల కింద రూ.57 వేల కోట్లను మహిళల ఖాతాలో జమచేశామని చెప్పారు. మంగళవారం అసెంబ్లీలో కేటీఆర్‌కు కౌంటర్ ఇస్తూ భట్టి విక్రమార్క మాట్లాడారు. మహిళలు బాగుపడితే కుటుంబం మొత్తం బాగుపడుతుంది తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వివరించారు.

బీఆర్‌ఎస్ నేతలకు మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఉందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. ప్రతి సందర్భంలో కేటీఆర్ మహిళల మనసు గాయపరుస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ మహి ళల గురించి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలని హితవుపలికారు. కేటీఆర్ దారి తప్పి మా ట్లాడుతున్నారనిపిస్తున్నదని, మహిళల అభివృద్ధి గురించి వారికి శ్రద్ధ ఉంటే వారి క్యాబి నెట్‌లో మహిళలకు అవకాశం కల్పించేవారన్నారు.

కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లా డుతున్నారని, వడ్డీ లేని రుణాలు చెక్కులు చెల్లించుకుంటూ పోతున్నామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముందుకు పోతూనే ఉంటామన్నారు. ప్రజా ప్రభుత్వం మహిళలను మహా రాణులుగా గౌరవిస్తుందని, వారు రాష్ట్రంలో ఎక్క డి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసేందుకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు.

ఆడబిడ్డల పక్షాన బస్సు చార్జీలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి క్రమం తప్పకుండా ప్రతినెలా చెల్లిస్తుందని వివరించారు. అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటాడు, మేకలను ఎక్కడ కట్టేయాలి అంటూ తాము డబుల్ బెడ్‌రూం ఇల్లు కట్టిస్తామని పదేళ్లపాటు మాటలు చెప్పారని, బీఆర్‌ఎస్ నేతల మాటలు నమ్మి ప్రజలు చూసి చూసి కళ్లు కాయలు కాశాయి కానీ ఇల్లు మాత్రం రాలేదన్నారు.

కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేసి నిర్మాణం ప్రా రంభించామని, మొదటి దశలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చోప్పున 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఒకేసారి రూ. 22,500 కోట్లు మంజూ రు చేశామని, దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజా ప్రభుత్వం అమలు చేసుకుంటూ ముందుకు పోతుందని తెలిపారు. కానీ బీఆర్‌ఎస్ నేతలు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ కూడా వారి పదేళ్ల పాలనలో నెరవేర్చలేదని భట్టి అన్నారు.