calender_icon.png 14 February, 2026 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాప్రభుత్వానికి ఈ ఫలితాలే నిదర్శనం

14-02-2026 01:26:56 AM

  1. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే వారికి చెంపదెబ్బ
  2. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 

హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాదని, సీఎం రేవంత్‌రెడ్డి నేతత్వంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంపై ఉన్న తిరుగులేని విశ్వాసానికి నిదర్శనమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇది రెండేళ్ల ప్రజాప్రభుత్వ పాలనకు ప్రజల ఆమోద ముద్ర అని పేర్కొన్నారు.

తమ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తీయడమే అజెండాగా పెట్టుకున్న శక్తులకు ఈ ప్రజాతీర్పు ఓ చెంపదెబ్బ అని తెలిపారు. ఓ వైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతూనే.. మరోవైపు అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల చెంతకు చేర్చాలన్న మా ప్రభుత్వ సంకల్పానికి ఈ ఫలితాలు నిదర్శనమని వెల్లడించారు. ఈ గెలుపు ప్రభుత్వంపై బాధ్యతను మరింత పెంచిందని, ఈ స్ఫూర్తితో తెలంగాణను అన్ని రంగాల్లోనూ ఇతర రాష్ట్రాలకు ధీటుగా అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషిచేస్తామని స్పష్టం చేశారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేసి తీరుతామని వెల్లడించారు. అబద్ధపు ప్రచారాలను నమ్మకుండా, అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలకు, ఈ ఎన్నికల్లో విజయం కోసం ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ మార్గ నిర్దేశనంలో, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ నాయకత్వంలో అహర్నిశలు కృషిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.