05-02-2026 12:31:07 AM
ఆదిలాబాద్, ఫిబ్రవరి ౪ (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి, వ్యయ నియంత్రణపై అవగాహన కలిగి ఉండాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు హనుమంత్ నాయక్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులకు బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఎన్నికల వ్యయంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని, పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సాధారణ ఎన్నికల పరిశీలకులు మాట్లాడుతూ...
అభ్యర్థులు వ్యయ పరిమితి ఒక రూ.లక్షగా నిర్ణయించబడిందని, తమ ఖర్చుల వివరాలను నిర్ణీత ఫారమ్ 1, 2, 3, 4లలో పొందుపరచాలని సూచించారు. అభ్యర్థులు తమ ఖర్చుల వివరాలను ఈ నెల 6వ, 9వ తేదీల్లో మున్సిపల్ కార్యాలయంలో ఆడిటర్లకు చూపించి, తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలా దేవి, రాజేశ్వర్, వ్యయ పరిశీలకులు విజయ, నోడల్ అధికారులు మనోహర్, సునీత, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్, ఇతర ఎన్నికల అధికారులు, అభ్యర్థులు పాల్గొన్నారు.