12 July, 2026 | 7:42 PM

ఏజెన్సీ ఎస్సీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించాలి

12-07-2026 06:48 PM

ఎస్సీ రైతుల సాగు భూములకు హక్కులు కల్పించాలి

మంత్రి వివేక్ వెంకటస్వామికి బొమ్మెర శ్రీనివాస్ వినతి

చుంచుపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రo ఏర్పడ్డ తర్వాత ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల స్థానిక రాజకీయ ప్రాతినిధ్యం ఎంపీటీసీ,జెడ్పీటీసీలు.ఏజెన్సీ ప్రాంత ఎస్సీ రైతుల తరతరాల సాగుభూములకు హక్కులు కెసిఆర్ ప్రభుత్వంలో తొలగించిన వాటిని తిరిగి అమలు చేయాలని షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మల శ్రీనివాస్ మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామినికి విన్నవించారు. ఆదివారం కొత్తగూడెం పర్యటనలో భాగంగా ఆయనను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

సంబంధిత మంత్రులు ఈ విషయంపై ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల పక్షాన నిలబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యకు పరిష్కారం మార్గం చూపాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల మనగడ ప్రశ్నార్ధకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన మంత్రి సమస్య పరిష్కారం కోసం ఆలోచన చేద్దామని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడ రమేష్, అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మద్దెల శివకుమార్, చిన్నన్న, గుండా రమేష్, అశోక్, ఎనగంటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.