12 July, 2026 | 7:29 PM

గాన కోకిల ఎస్.జానకికి లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఘన నివాళి

12-07-2026 06:38 PM

నేరేడుచర్ల,(విజయక్రాంతి): లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నేపథ్య గాయని, గాన కోకిల ఎస్. జానకి మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ బట్టు మధు, క్లబ్ అధ్యక్షులు షేక్ యూసుఫ్ మాట్లాడుతూ... ఎస్.జానకి మూడు దశాబ్దాలకు పైగా సినీ సంగీత రంగంలో విశిష్ట సేవలందించి వేలాది మధుర గీతాలను ఆలపించారని, ఆమె తన అపూర్వ గాన ప్రతిభతో అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలను అందుకుని తెలుగు జాతికి ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు తీసుకువచ్చిన గొప్ప తెలుగు ఆడపడుచు అని కొనియాడారు. ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని అన్నారు.