13 July, 2026 | 1:19 AM

యథేచ్ఛగా కలప అక్రమ దందా..

13-07-2026 12:16 AM

జిల్లాలో భారీగానే కలప అక్రమ నిల్వలు

సామిల్లులు, టింబర్ డిపోల్లో అనుమతి ధ్రువపత్రాలు లేని కలప

సా మిల్లులపై నిఘా పెట్టని సంబంధిత శాఖ అధికారులు

జిల్లాలో కలప డిపోలపై తనిఖీలు కరువు

అటవీ సమీప గ్రామాల్లోనూ లెక్కలేనన్ని కలప నిల్వలు

మెదక్,జులై 12 (విజయక్రాంతి): జిల్లాలో కలప అక్రమ దందా యథేచ్ఛగా సాగుతునే ఉంది. పలు ప్రాంతాల్లో భారీగానే కలప అక్రమ నిల్వలు ఉన్నాయి. కలప వ్యాపారం చేసే పలువురు వ్యాపారులతో కలప స్మగర్లకు సత్ససంబంధాలు ఉండటంతో జిల్లాలోని అటవీ ప్రాంతాల నుంచి చెట్లను నరికి అక్రమంగా కలపను తీసుకురావడమే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి ఎలాంటి అనుమతి ధ్రువపత్రాలు లేకుండానే కలపను దిగుమతి చేసుకుంటూ నిల్వలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని పలు శామిల్లు, టింబర్ డిపోల్లో భారీగానే కలప అక్రమ నిల్వలు ఉన్నప్పటికీ వాటిపై సంబంధిత శాఖ అధికారులు తనిఖీలు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భారీగానే కలప అక్రమ నిల్వలు..

జిల్లాకు జాతీయ రహదారులు ఉండటంతో అక్రమంగా కలప జిల్లాకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా జిల్లాలో పలుచోట్ల భారీగానే కలప అక్రమ నిల్వలు ఉన్నాయని ని ఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం సమాజంలో ఇళ్ల నిర్మాణాల్లోనూ, ఇంటీరియల్ డేకరేషన్లోనూ ప్రధానంగా కలపని ఉ పయోగిస్తున్నారు. కలప సామగ్రీలకు, వస్తువులకు మార్కెట్లో భలే డిమాండ్ ఏర్ప డుతోంది. దీంతో కలప వ్యాపారం చేసే వ్యా పారులకు చేతినిండా పని దొరుకుతుండటంతో కలప అక్రమ దిగుమతికి పన్నాగాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది.

ప్రధానంగా కలప సామగ్రి, వస్తువులు తయారు చేసే సామిల్లు, టింబర్ డిపోలు, వడ్రంగి పనులు చేసే ఖర్కానా లాంటిలో చాలానే సంబంధిత అటవీశాఖ నుంచి ఎలాంటి ధ్రువ పత్రాలు లేనటువంటి కలప దుంగలు భారీగానే నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని కొందరు శా మిల్లు, టింబర్ డిపో, వడ్రంగి ఖర్కానాలకు చెందిన వ్యాపారులు కలప స్మగ్లర్లతో సత్ససంబంధాలు పెట్టుకుంటూ కలపను అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. అంతే కాకుండా అటవి సమీప ప్రాంతాలు, గ్రామాల్లో భారీగానే కలప నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది.

మెదక్ జిల్లాలో 27 సా మిల్లులు, 11 టింబర్ డిపోలు..

జిల్లాలో శామిల్లపై అధికారుల తనిఖీలు కరువయ్యాయి. మెదక్, తూప్రాన్, నర్సాపూర్ రెవెన్యూ డివిజన్లోని ఆయా గ్రామాల్లో వందలాది సంఖ్యలో కలప వ్యాపారం చేసే శామిల్లు, టింబర్ డిపోలు, వడ్రంగి ఖర్కానాలు ఉన్నప్పటికీ వాటిపై అధికారులు తనిఖీలు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వినబడుతున్నాయి.

అటవీ సమీప ప్రాంతాల్లో, గ్రామాల్లోనే సంబంధిత శాఖ అధికారు లు తనిఖీలు చేస్తున్నారే తప్ప కలప వ్యాపా రం చేసే శామిల్లలో ఎందుకు తనిఖీలు చే యడం లేదనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. జిల్లాలో 27 శామిల్లు, సుమారు 11 టింబర్ డిపోలతో పాటు చాలా వరకు వడ్రంగి ఖ ర్కానాలు ఉన్నాయి. స్థానికంగా ఉండేవారు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఈ వ్యాపారం ఎక్కువగా చేస్తున్నార న్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి శామిల్లపై అ ధికారులు తనిఖీలు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.

అనుమతి ధ్రువ పత్రాలు లేకున్నా కలప దుంగల నిల్వలు..

జిల్లాలోని కలప వ్యాపారం చేసి పలు శామిల్లలో, టింబర్ డిపోల్లో, వడ్రంగి ఖర్కానాలో అటవీశాఖ అనుమతి ధ్రువపత్రాలు లేకుండానే భారీగానే కలప దుంగల నిల్వలు ఉన్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. అటవీశాఖ నిబంధనల ప్రకారం అధికారులు ఇచ్చిన అనుమతి మేరకే టేకు చెట్లను, ఇతర కలప చెట్లను నరకాల్సి ఉంటుంది. నరికిన తరువాత అటవీశాఖ అధికారులు ఆ కలపను పరిశీలించి కలప దుంగలకు ప్రత్యేక నెంబర్లు ఇవ్వడంతో పాటు ధ్రువ పత్రాలను జారీ చేస్తారు.

అప్పుడు ఆ కలపను అధికారికంగా వ్యాపారులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ జిల్లాలోని చాలా సామిల్లలో, టింబర్ డిపోలలో, వండ్రంగి కార్కానాలలో అటవీశాఖ అధికారులు మార్కు వేసిన కలపదుంగ ల కంటే మార్కు వేయని కలప దుంగలే ఎక్కువగా కన్పిస్తాయి. ఇలాంటి అనుమతి లేనటువంటి కలప నిల్వలు భారీగానే ఉన్నట్లు తెలిసింది.

శామిల్లలో, కలప వ్యాపారం చేసే ఖర్కానాలో అటవీ, పోలీసుశాఖ అధికారులు తనిఖీలు చేస్తే భారీగా అక్రమ కలప నిల్వలు బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా జిల్లాలో రామా యంపేట, అక్కన్న పెట్, చిన్న శంకరం పేట, నర్సాపూర్ లాంటి ప్రాంతాల్లో దట్టమైన అ డవి ఉంది. జిల్లా అటవీ ప్రాంతంలోనూ కలపకు మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో కలప వ్యాపారులు స్మగ్లర్లతో మిలాఖత్ అ యి కలప దందాను జోరుగా సాగిస్తున్నారు. 

మరింత నిఘా పెడతాం..

జిల్లాలో కలప అక్రమ దందా తమ దృష్టికి రాలేదు. ఎక్కడైనా భారీగానే అక్రమ కలప నిల్వలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకువస్తే దాడులు చేసి కలపను స్వాధీనం చేసుకోవడమే కాకుండా నిందితులపై చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని శామిల్లు, టింబర్ డిపోలపై మరింత నిఘా పెడతాం. ఎవరైన అడవుల్లోని అటవీ సంపదను కొల్లగొట్టినా, అక్రమంగా కలపను సరఫరా చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

 జోజీ, డీఎఫ్‌ఓ