ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
- ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి నాగేశ్వరరావు
టేకులపల్లి,(విజయక్రాంతి): ఆటో కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకుడు డి. ప్రసాద్ డిమాండ్ చేశారు. టేకులపల్లిలో బానోతు లక్ష్మణ్, షఫీ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ఆటో కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో వారు మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి ఆటో కార్మికుడికి ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఆ హామీ అమలుకు నోచుకోకపోవడం బాధాకరమన్నారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, ప్రతి ఆటో కార్మికుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల హామీల అమలుతో పాటు ఆటో కార్మికుల సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.






