13 July, 2026 | 1:59 AM

నిరుద్యోగ పోరు దీక్షను విజయవంతం చేయాలి

13-07-2026 01:09 AM

విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కోతిమీర్‌కార్ వినయ్ కుమార్

కామారెడ్డి, జూలై 12 (విజయక్రాంతి): నిరుద్యోగ పోరు దీక్షను విజయవంతం చేయాలని విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్తిమీరకర్ వినయ్ కుమార్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని  ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో ఆదివారం విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఈ నెల 14న హైదరాబాద్లో నిర్వహించనున్న ‘నిరుద్యోగ పోరు దీక్ష‘ పోస్టర్ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మికార్ వినయ్ కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 14వ తేదీ మంగళవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నిర్వహించనున్న నిరుద్యోగ పోరు దీక్షలో నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి, ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సేన నాయకులు గౌస్ పాషా, చందు, నోమన్, శ్రీకాంత్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.