13 July, 2026 | 1:59 AM

జానకమ్మకు కడసారి వీడ్కోలు

13-07-2026 01:06 AM
  1. అంతిమయాత్రలో వేలాది మంది అభిమానులు
  2. మైసూర్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

బెంగళూరు, జూలై ౧౨:  వేలాది మంది అభిమానుల అశ్రునయనాల మధ్య ‘దక్షిణాది నైటింగేల్’ ఎస్.జానకి (88) అంత్యక్రి యలు జరిగాయి. ఆమెకు కడసారి వీడ్కోలు పలికేందుకు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆదివారం కర్ణాటక ప్రభుత్వం మైసూరులో అధి కారిక లాంఛనాలతో జానకి అంత్యక్రియలను నిర్వహించింది.

అంతకుముందు అభి మానుల సందర్శనార్థం జానకి పార్థివదేహాన్ని మైసూరు మహారాజా కళాశాల మైదా నంలో ఉంచింది. అనంతరం భౌతిక కాయా న్ని కణియనహుండిలోని సొంత ఫాంహౌస్‌కు తరలించారు. జానకి మనుమరాలు వైద్యుల (అప్సర) అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధరామయ్య హాజరై నివాళులర్పించారు.